Minister Anil Kumar: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై అన్ని రకాలుగా అటాక్ చేస్తాం.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని అక్రమ ప్రాజెక్టులపై అన్ని రకాలుగా అటాక్ చేస్తామని హెచ్చరించారు.
AP Minister Anil Kumar Yadav Hot Comment on Telangana Projects: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది. వివిధ పార్టీల నేతలతో పాటు మంత్రుల దాకా ఒకరిపైనొకరు గట్టిగానే విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని అక్రమ ప్రాజెక్టులపై అన్ని రకాలుగా అటాక్ చేస్తామని హెచ్చరించారు. ఒప్పందాలకు నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోందని మంత్రి అనిత్ ఆరోపించారు. రాష్ట్రం కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని అయన అన్నారుజ
ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మాత్రం అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని మండిపడ్డారు.
వైఎస్ఆర్ గానీ, సీఎం జగన్‌కు గానీ రాయలసీమ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పై తెలంగాణ నేతల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే విమర్శించాల్సిన తెలుగుదేశం పార్టీ మౌనం వహించడంపై మండిపడ్డ మంత్రి.. జూమ్ మీటింగులకు పరిమితం కావడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుల వివాదాలను కృష్ణా రివర్ బోర్డు పరిధిలోకి తెచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మరోవైపు, తెలంగాణకు చెందిన నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న మంత్రి.. దివంగత నేత వైఎస్‌ఆర్‌పైన, సీఎం జగన్‌పైన విమర్శలు.. వారి సంస్కృతి కే వదిలేస్తున్నామన్నారు.