T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jun 28, 2021 | 10:52 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలయింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడి నియామకం చిచ్చు రేపింది. తమకే కావాలంటూ కొందరు... తమకు నచ్చిన నాయకుడికే ఇవ్వాలని...

T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు
Tpcc

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలయింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడి నియామకం చిచ్చు రేపింది. తమకే కావాలంటూ కొందరు… తమకు నచ్చిన నాయకుడికే ఇవ్వాలని కొందరు హస్తిన కేంద్రంగా చక్రం తిప్పేందుక ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. అసలు సంగతి తెలిసే సరికి అగ్గిమీద గుగ్గలం అవుతున్నారు. ఆశావాహులంతా ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై రుస రుసలాడుతున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాకుండా బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

టీపీసీసీ చీఫ్‌ ఎంపిక కొందరు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన సీనియర్‌ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాకుండా బాహాటంగానే మండిపడుతున్నారు.  ఇక ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది నేతలు బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సీనియర్‌ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌పై కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేయడం పార్టీలో చర్చ మొదలైంది. డబ్బులకు పదవి అమ్ముడుపోయిందని కోమటిరెడ్డి చేసిన విమర్శలను కొత్తగా పదవుల్లో నియమితులైన పార్టీ నాయకులు సెంట్రల్ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దవుతున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీపై తీవ్ర ఆరోపణలు చేసిన వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీని కోరుతామని మహేశ్వర్‌రెడ్డి పేర్కొనగా.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే సోనియా గాంధీని విమర్శించినట్టేనని విమర్శించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను పీసీసీ మరో కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన అర్హులేనని, ఆయన ఆవేదనలో అర్థం ఉందని అన్నారు. అయితే మీడియా ముందు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఇవి కూడా చదవండి : Aadhaar Link : భూ రికార్డులతో ఆధార్ అనుసంధానం.. పారదర్శకత కోసం మరో రెండిటితో లింక్..! ఏంటో తెలుసుకోండి..?

Marri Shashidhar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ పదవి రచ్చ.. రాజీనామా చేసిన మరో సీనియర్ నేత..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu