DGP Mahender Reddy: తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదు.. లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తాంః డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించారు. సోమవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్ చేరుకున్నారు.

DGP Mahender Reddy: తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదు.. లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తాంః డీజీపీ మహేందర్ రెడ్డి
Dgp Mahender Reddy Arrives In Kumuram Bheem Asifabad
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2021 | 2:23 PM

DGP Mahender Reddy Vists Kumuram Bheem Asifabad District: రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించారు. సోమవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్ చేరుకున్నారు. అసిఫాబాద్ చేరుకున్న ఆయనకు పోలీసు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో పోలీస్ అధికారులతో మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా, ఈ మధ్య కాలంలో మావోయిస్టు అగ్రనేతలు అనారోగ్యంతో మృతి చెందడం, మరికొందరు కరోనా బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో డీజీపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా బారన పడ్డ మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. అడవుల్లో కరోనాకు సరియైన చికిత్స లేదని.. కరోనా బారినపడి ప్రాణాలు వదలొద్దు.. కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకుని జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు. మావోస్టుల ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నామని.. తిరిగి తెలంగాణకు రావాలను కుంటే ఈసారి గట్టి ఎదురు దెబ్బ తప్పదని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

Read Also…. Murder Mystery: తిరుపతిలో సూట్ కేసులో శవం మిస్టరీ వీడింది.. మహిళా టెక్కీని చెప్పంది భర్తనే.. ఆపై పెద్ద డ్రామా..