Murder Mystery: తిరుపతిలో సూట్ కేసులో శవం మిస్టరీ వీడింది.. మహిళా టెక్కీని చంపింది భర్తనే.. ఆపై పెద్ద డ్రామా..

పోలీసు జరిపిన విచారణలో బంధువుల వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆడిన డ్రామా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని... రుయా ఆసుపత్రిలో చేర్చానని... కుటుంబ సభ్యులకు శ్రీకాంత్ రెడ్డి నమ్మించాడు.

Murder Mystery: తిరుపతిలో సూట్ కేసులో శవం మిస్టరీ వీడింది.. మహిళా టెక్కీని చంపింది భర్తనే.. ఆపై పెద్ద డ్రామా..
Dead Body Mystery
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 28, 2021 | 2:42 PM

తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక కనిపించిన మృతదేహం మిస్టరీ వీడింది. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి వెనుక పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించిన శవం కేసును తేల్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కుడే ఆమెను హ‌త్య చేశాడ‌ని గుర్తించారు. వివ‌రాల్లోకి వెళ్తే… తిరుప‌తి రుయా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల‌ కాలిన స్థితిలో ఓ మృత‌దేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు.  కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన స్థానిక పోలీసులు..  మృతదేహం పుంగ‌నూరు మండ‌లం రామ‌సముద్రానికి చెందిన టెక్కీ భువనేశ్వరిగా నిర్దారించారు. భార్య భువనేశ్వరిని ఇంట్లో హ‌త్య చేసి రుయా ఆసుప‌త్రి ఆవరణలో మృతదేహాన్ని శ్రీ‌కాంత్ రెడ్డి కాల్చినట్లుగా తేలింది. రెండున్న‌రేళ్ల క్రితం వారిద్ద‌రు ప్రేమ‌ వివాహం చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

అయితే పోలీసు జరిపిన విచారణలో బంధువుల వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆడిన డ్రామా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని… రుయా ఆసుపత్రిలో చేర్చానని… కుటుంబ సభ్యులకు శ్రీకాంత్ రెడ్డి నమ్మించాడు. ఆ తర్వాత భువనేశ్వరి డెల్టా వేరియంట్ తో భార్య చనిపోయిందని నమ్మించాడు. ఇందులో భాగంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు బంధువులకు ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు.

అంతేకాదు బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు ఓ సీన్ క్రియేట్ చేశాడు. అయితే అక్కడ యువతి మృత దేహం లేకపోయే సరికి రుయా సిబ్బంది అంత్యక్రియలు చేసేసారని కుటుంబ సభ్యులని నమ్మించాడు శ్రీకాంత్. అయితే ఆ తర్వాత పోలీసులకు కాలిన మృతదేహం దొరకడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

మృతురాలిని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భువనేశ్వరిగా గుర్తించారు. ఇంట్లో భార్యని హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేసి కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆసుపత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు.నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి: Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

Salman Khan: తన తమ్ముళ్ళతో కలిసి డ్యాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ .. వీడియో సోషల్ మీడియాలో హల్ చల్

పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
పెర్ట్ టెస్ట్ కోసం రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్ అదిరిపోయిందిగా
పెర్ట్ టెస్ట్ కోసం రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్ అదిరిపోయిందిగా