Ancient Humans: చైనాలో లక్షా నలభై ఏళ్ళనాటి మానవ శిలాజం.. చతురస్రాకారపు కళ్ళతో నివసించిన డ్రాగన్ మేన్ ఆనవాళ్లు!
Ancient Humans: సైన్స్ కి అంతు ఉండదు. పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఎప్పుడూ తెలియని విషయాల గురించి చెబుతాయి.
Ancient Humans: సైన్స్ కి అంతు ఉండదు. పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఎప్పుడూ తెలియని విషయాల గురించి చెబుతాయి. మరికొన్ని ఇంతకు ముందు తెల్సిన విషయాలకు కొనసాగింపుగా ఉంటాయి. ఇంకొన్ని అప్పుడెప్పుడో తెలుసుకుని అదే నిజం అనుకుని సాగుతున్న ప్రయాణానికి బ్రేకేస్తూ దానికి సంబంధించిన కొత్త విషయాన్ని ప్రపంచం ముందు పెడుతుంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. విశ్వ రహస్యాల శోధన అంత తేలికగా ముగియదు. తాజగా చైనాలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో 1930 లో అక్కడ దొరికిన ఒక పుర్రెను అందులో పెద్ద విశేషం ఏమీలేదని పక్కన పాడేశారు. అయితే, తాజాగా ఆ పుర్రెపై జరిపిన పరిశోధనలు కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి.
1930 లో ఈశాన్య చైనాలో, 1 లక్ష 40 వేల సంవత్సరాల పురాతన పుర్రె కనుగొన్నారు. దీనికి హోమో-లాంగి అనీ, డ్రాగన్ మేన్ అనీ పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు, ఈ పుర్రె మానవుని కొత్త జాతికి సంబంధించినది కావచ్చు అని ప్రస్తుతం భావిస్తున్నారు. ఇది నియాండర్తల్, హోమో ఎరెక్టస్ వంటి పురాతన మానవ జాతులకు దగ్గరి పూర్వీకుడికి చెందినది కావచ్చని అనుకుంటున్నారు. చైనాకు చెందిన హెబీ జియో విశ్వవిద్యాలయం దీనిపై పరిశోధనలు చేస్తోంది. వీరి పరిశోధనల్లో పలు విషయాలు తెలిశాయి. ఈ పుర్రె కలిగిన మానవుడి కళ్ళు చతురస్రంగా ఉండేవని అంటున్నారు. అలాగే నోరు వెడల్పుగానూ, పళ్ళు పెద్దవిగానూ ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పుర్రె ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శిలాజంగా దొరికింది. ఈ పుర్రె మగవాడు. ఇతను తన 50 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈ మానవుడు అడవుల్లో జీవించాడు.
ఇక ఈ పుర్రె శిలాజం భౌగోళిక-రసాయన విశ్లేషణలో ఇది 1,46,000 సంవత్సరాల పురాతనమైనదని తేలింది. పరిశోధకులు, హెర్బిన్ సమూహంలోని ఈ సభ్యులు కనిపించడం ఎప్పుడు ఆగిపోయిందో ఇంకా తెలియరాలేదని చెప్పారు.
వీరు హోమో సేపియన్ల మాదిరిగా పక్షులను వేటాడి జీవించేవారని తేల్చారు. అలాగే, ఈ సమూహంలోని వారు పండ్లు, కూరగాయలను సేకరించేవారని భావిస్తున్నారు. బహుశా వారు చేపలను కూడా పట్టుకుని ఆహారంగా తీసుకునేవారని అంటున్నారు.
1930లో దొరికిన ఈ పుర్రెను దశాబ్దాలుగా పక్కన పాడేశారు. చైనాలోని హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ఒక పాడుపడిన బావిలో దీనిని పడేశారు. వీటిని 2017లో పరిశోధకులకు అప్పగించారు. అప్పటినుంచి దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనలు ఇంకా చేస్తున్నారు. ఇవి పూర్తయితే, మానవ పరిణామ క్రమంలో కొత్త అంశం వచ్చి చేరవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Agni P: ‘అగ్ని పీ’ పరీక్ష విజయవంతం; ఈ సిరీస్‌లో అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన డీఆర్‌డీవో