AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agni P: ‘అగ్ని పీ’ పరీక్ష విజయవంతం; ఈ సిరీస్‌లో అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన డీఆర్‌డీవో

అగ్ని సిరీస్‌లో అత్యధునికమైన వేరియంట్‌ అయిన అగ్ని-పీ బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీవో నేడు విజయవంతంగా పరీక్షించింది. ఇది 1,000 కిలో మీటర్ల నుంచి 2,000 కిలో మీటర్ల వరకు దూసుకపోయే సామర్థ్యం గలది.

Agni P: 'అగ్ని పీ' పరీక్ష విజయవంతం; ఈ సిరీస్‌లో అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన డీఆర్‌డీవో
Agni P Ballistic Missile
Venkata Chari
|

Updated on: Jun 28, 2021 | 1:35 PM

Share

Agni P: అగ్ని సిరీస్‌లో అత్యధునికమైన వేరియంట్‌ అయిన ‘అగ్ని పీ’ ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) నేడు విజయవంతంగా పరీక్షించింది. ఇది 1,000 కిలో మీటర్ల నుంచి 2,000 కిలో మీటర్ల దూరం వరకు దూసుకపోయే సామర్థ్యం గలది. ఒడిశా తీరంలో ఈ ప్రయోగాలను విజయవంతంగా పరిక్షించింది. ఒడిశా తీరంలోని ఉదయం గం. 10.55 లకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగాలను నిర్వహించింది. “తూర్పు తీరం వెంబడి ఉన్న పలు టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాలను క్షుణ్ణంగా ట్రాక్ చేసి పర్యవేక్షించాయి. క్షిపణి ఓ క్రమపద్ధతిని అనుసరించి అన్ని లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకుందని” డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది. డీఆర్‌డీవో ప్రయోగించిన అగ్ని సిరీస్‌లో అగ్ని పీ మొదటిది. ఈ బాలిస్టిక్ క్షిపణి.. అగ్ని 3 కన్నా 50శాతం తక్కువ బరువు కలిగి ఉంది. దీనిని రైలు, రహదారి గుండా తీసుకపోవచ్చని, అలాగే ఎక్కవ కాలం నిల్వచేయవచ్చని తెలిపింది. అలాగే రవాణాకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని డీఆర్‌డీవో పేర్కొంది.

అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-పీ.. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలో మీటర్ల మధ్య దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఇండో-పసిఫిక్‌లోని శత్రువులను టార్గెట్ చేసుకుని ప్రయోగించేందుకు వీటిని ఉపయోగించవచ్చని డీఆర్‌డీవో పేర్కొంది. గత శుక్రవారం డీఆర్‌డీవో ఒడిశా తీరంలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లను కూడా విజయవంతంగా పరిక్షీంచింది. 45 కిలోమీటర్ల దూరం వరకు గల లక్ష్యాలపై దాడిచేయగల 25 పినాకా రాకెట్లను పరిక్షీంచింది.

Also Read:

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం

Maoists Dump: మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నగదు స్వాధీనం.. మావోయిస్టులకు చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు

నాడు నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్మిన మహిళ నేడు ఎస్ఐ… కేరళలో మారిన ఆమె జీవిత గమ్యం

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?