AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూలో మళ్ళీ ఎగిరిన రెండు డ్రోన్లు… కాల్పులు జరిపిన భద్రతా దళాలు… పాక్ ఉగ్రవాదుల హస్తం ?

జమ్మూ లోని కలుచక్ మిలిటరీ కేంద్రం వద్ద నిన్న రాత్రి వేర్వేరు సమయాల్లో భారత భద్రతా దళాలు గుర్తించాయి. వాటిపై కాల్పులు జరిపి కూల్చి వేయడానికి చేసిన యత్నాలు ఫలించలేదని, అవి చీకటిలో తప్పించుకుపోయాయని సైనికాధికారులు తెలిపారు.

జమ్మూలో మళ్ళీ ఎగిరిన రెండు డ్రోన్లు... కాల్పులు జరిపిన భద్రతా దళాలు... పాక్ ఉగ్రవాదుల హస్తం ?
Drones Spotted
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 28, 2021 | 2:59 PM

Share

జమ్మూ లోని కలుచక్ మిలిటరీ కేంద్రం వద్ద నిన్న రాత్రి వేర్వేరు సమయాల్లో భారత భద్రతా దళాలు గుర్తించాయి. వాటిపై కాల్పులు జరిపి కూల్చి వేయడానికి చేసిన యత్నాలు ఫలించలేదని, అవి చీకటిలో తప్పించుకుపోయాయని సైనికాధికారులు తెలిపారు. జమ్మూ-పఠాన్ కోట్ నేషనల్ హైవే పై గల కలుచక్-పురమండల్ సమీపంలోని సైనిక కేంద్రం వద్ద రెండు సార్లు ఇవి ఎగరడాన్ని తాము గుర్తించామన్నారు. ఒకటి రాత్రి 11 గంటల 45 నిముషాల సమయంలోను..మరొకటి తెల్లవారుజామున 2 గంటల 40 నిముషాల ప్రాంతంలోనూ ఎగిరినట్టు వారు చెప్పారు. తాము సుమారు 20 నుంచి 25 రౌండ్ల కాల్పులు జరిపినా ఫలితం లేకపోయిందన్నారు. వీటిని గుర్తించడానికి ఈకేంద్రం వద్ద పెద్ద ఎత్తున గాలింపు ప్రరారంభించారు.

జమ్మూలో హైఅలర్ట్ ప్రకటించారు. నిన్న ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద పేలుళ్లకు పాక్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నవారు డ్రోన్లను వినియోగించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. ఈ డ్రోన్లలో పే లోడ్ ని కూడా అమర్చి ఉండవచ్చునని జమ్మూ కాశ్మీర్ డీజీపీ తెలిపారు. ఈ దాడి వెనుక పాక్ టెర్రరిస్టుల హస్తం ఉన్నట్టు దాదాపు ఆయన ధృవీకరించారు. అటు నిన్న సాయంత్రం ఓ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి సుమారు 6 కేజీల బరువు ఉన్న బాంబు వంటి పేలుడు వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో మళ్ళీ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం భద్రతా దళాలకు ఆందోళన కలిగిస్తోంది. అయితే తాము అలర్ట్ గా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: PM Kisan Samman : పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చివరి తేది జూన్ 30..! ప్రయోజనం పొందాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి..

AIMIM Strategy: ఉత్తరాదిపై మళ్ళీ నజర్.. యుపీలో వందసీట్లకు పోటీ అంటున్న సీనియర్ ఓవైసీ

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్