తిరుపతిలో టెన్షన్.. టెన్షన్! నన్ను అవమాన పర్చినా!
టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీ భాగంగా తిరుపతిలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుగా తిరుపతి ప్రధాన కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహానికి చంద్రబాబు నివాళలర్పించారు. అనంతరం ర్యాలీగా సాగుతూ జోలె పట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నా.. చంద్రబాబు ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిని మార్చే అధికారం, స్వేచ్ఛ సీఎంకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. నన్ను అవమాన పర్చినా.. నేను బాధపడను. అందరికి సమాన దూరంలో ఉన్న ప్రాంతం […]

టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీ భాగంగా తిరుపతిలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుగా తిరుపతి ప్రధాన కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహానికి చంద్రబాబు నివాళలర్పించారు. అనంతరం ర్యాలీగా సాగుతూ జోలె పట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నా.. చంద్రబాబు ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిని మార్చే అధికారం, స్వేచ్ఛ సీఎంకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. నన్ను అవమాన పర్చినా.. నేను బాధపడను. అందరికి సమాన దూరంలో ఉన్న ప్రాంతం అమరావతి.. అందుకే దాన్ని రాజధానిగా ఎంచుకున్నామన్నారు. తిరుపతికి వస్తుంటే 144 సెక్షన్ పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. సీఎం జగన్ ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేయాలన్నారు. కాగా.. అమరావతికి అన్ని హంగులు ఉన్నాయని.. మళ్ళీ మాకు అవకాశం వస్తే.. అప్పుడు తప్పక అభివృద్ధి చేసి తీరుతామన్నారు. జగన్‌కు సైతాను పట్టిందని.. ఆ ఏసుప్రభు కూడా విడిపించలేరని వ్యాఖ్యానించారు. తిరుపతిలో పుట్టి పెరిగిన నాకు పోలీసులు దారులు చూపిస్తున్నారన్నారు చంద్రబాబు.
కాగా.. నాలుగు వారాలుగా రాజధాని అమరావతి కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో చంద్రబాబు అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా.. పలు నిరసన సభలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా సంక్రాంతి వేడుకల్ని సైతం చంద్రబాబు రద్దు చేసుకున్నారు.



