ఆ ఏటీఎంలో రూ.100కు బదులు రూ.500 వస్తోంది.. ఎగబడుతున్న జనం!
ఏటీఎంల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం సహజం. అప్పుడప్పుడూ పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలో ఒక ఏటీఎంలో సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తింది. దీనితో ఎవరైతే ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తున్నారో వారికి ఐదురెట్లు ఎక్కువగా నగదును అందించింది. ఇక ఈ విషయం ఆ ఊర్లో ఉన్న అందరికి తెలియడంతో జనాలు ఎగబడి నగదును ఉపసంహరించుకున్నారు. బ్యాంక్ అధికారులకు ఈ సమస్య గురించి తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని […]
ఏటీఎంల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం సహజం. అప్పుడప్పుడూ పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలో ఒక ఏటీఎంలో సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తింది. దీనితో ఎవరైతే ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తున్నారో వారికి ఐదురెట్లు ఎక్కువగా నగదును అందించింది. ఇక ఈ విషయం ఆ ఊర్లో ఉన్న అందరికి తెలియడంతో జనాలు ఎగబడి నగదును ఉపసంహరించుకున్నారు. బ్యాంక్ అధికారులకు ఈ సమస్య గురించి తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మడికేరిలో కెనరా బ్యాంకు ఏటీఎం రూ.100కు బదులు రూ.500 ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి రూ.500 విత్ డ్రా చేసుకోగా అతనికి అనూహ్యంగా రూ.2500 వచ్చాయి. ఇంకేముంది ఈ విషయం స్థానికంగా ప్రచారమైంది. జనం తండోపతండాలుగా ఏటీఎం వద్దకు ఎగబడి డబ్బులు తీసుకున్నారు. అలా ఏకంగా రూ.1.7 లక్షలు డ్రా చేసుకున్నారు.
అయితే ఈ తతంగం మొత్తాన్ని కొంతమంది బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డబ్బులు విత్ డ్రా చేసిన కొంతమందిని గుర్తించి వారిని అడగ్గా కేవలం ఇద్దరు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగిలినవారు మాత్రం అది బ్యాంక్ పొరపాటని.. తాము ఎందుకు నగదు తిరిగివ్వాలని వాదించారు. దానితో సదరు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు మిగతావారికి కూడా సర్దిచెప్పి డబ్బును తిరిగిప్పించారు. దానితో ఆ సంస్థ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, డబ్బు ఏటీఎంలో నిల్వ ఉంచేటప్పుడు అనుకోకుండా రూ.100 ట్రేలో రూ.500 నోట్లు ఉంచడం వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది.