క్రెడిట్ కార్డులు సరైన పద్ధతిలో ఉపయోగించకుంటే నష్టాలు తెచ్చిపెడతాయి. పెట్రోల్ బంకులు, ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్స్, ఏటీఎం విత్డ్రాయల్స్, వాలెట్ లోడ్ చేయడం, అంతర్జాతీయ చెల్లింపుల సమయంలో క్రెడిట్ కార్డులను వాడటం వల్ల అధిక ఫీజులు, జీఎస్టీ, వడ్డీలు పడతాయి. ఆర్థిక నష్టాలను నివారించడానికి ఈ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులను వాడకపోవడమే మంచిది.