రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్
కోలీవుడ్‌లో దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నారనే టాక్ తీవ్రంగా ఉంది. భార్య గీతాంజలి సోషల్ మీడియాలో భర్తతో ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ రూమర్లకు బలం చేకూరింది. 14 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. గతంలో సోనియా అగర్వాల్‌తో విడాకులు తీసుకున్న సెల్వరాఘవన్, ఈసారి ఏ క్లారిటీ ఇస్తారో చూడాలి.
ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట విడిపోనుందని కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ తమిళ సినిమా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సెల్వ రాఘవన్ భార్య, ప్రముఖ దర్శకురాలు గీతాంజలి తన సోషల్ మీడియాలో భర్తతో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఉన్నట్లుండి సడెన్ గా ఫొటోలు తీసేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని రూమర్లు వినిపిస్తున్నాయి. పేరుకు తమిళ దర్శకుడే అయినా సెల్వరాఘవన్ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం. ‘కాదల్ కొండేన్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేశాడు సెల్వ. ఇందులో ఆయన తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. ఇక 7/G రెయిన్‌బో కాలనీ సినిమాను 7/G బృందావనంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇందులో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సెల్వ రాఘవన్. 2006లో వీరి పెళ్లి జరిగింది. అయితే ఎక్కువ కాలం కలిసుండలేపోయారు. 2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది దర్శకురాలు గీతాంజలి ని రెండో పెళ్లి చేసుకున్నాడీ డైరెక్టర్. 14 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసున్న ఈ దంపతుల మధ్య ఇప్పుడు మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ కోలీవుడ్ లో వీరి విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ విడాకుల వార్తలు నిజమా? కాదా? అన్న ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్.. క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే
Suman Shetty: బిగ్ బాస్ చరిత్రలోనే భారీ రెమ్యూనరేషన్ !! సుమన్ శెట్టికి భారీగా డబ్బులు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

