Election Commission Live Updates: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న ఎన్నికల సంఘం..
Election Commission Press Conference Live Updates in Telugu : ఆదివారం 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఇందులో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

LIVE NEWS & UPDATES
-
ఓటర్ జాబితా ప్రక్రియ సమగ్రంగా నిర్వహించాం
- ఓటర్ జాబితా ప్రక్రియ సమగ్రంగా నిర్వహించాం – సీఈసీ
- ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు నా అభినందనలు – సీఈసీ
- అక్రమ ఓటర్లను ఏరివేతకు SIR కొనసాగుతుంది – సీఈసీ
- అర్హత ఉన్న ప్రతీ ఓటర్‌ను జాబితాలో చేరుస్తామని ప్రకటన
-
రేపే బీజేపీ అభ్యర్థుల జాబితా..?
- కేరళలో సోమవారం బీజేపీ తొలి దశ అభ్యర్థుల జాబితా విడుదల..?
- ఒకే దశలో అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్..
-
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- ఎన్నికల షెడ్యూల్ రాగానే అమల్లోకి ఎన్నికల కోడ్..
- ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదు.
- షెడ్యూల్ తర్వాత 5 రాష్ట్రాల్లో అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్..
-
అస్సాంలో అమిత్ షా పర్యటన
- అస్సాంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటన
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాం నుంచే పార్లమెంట్‌కు..
- ఎన్నికైనా అభివృద్ధిని పట్టించుకోలేదని షా విమర్శలు.
- బీజేపీ గత పదేళ్లలో అస్సాంను ఆరోగ్యం, విద్యారంగాల్లో అగ్రస్థానంలో నిలిపింది – అమిత్ షా
-
అస్సాంలో ఆప్ తొలివిడత అభ్యర్థుల జాబితా రిలీజ్
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ4 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
-
-
అసెంబ్లీ గడువు ఎప్పుడు ముగుస్తుంది?
- పశ్చిమ బెంగాల్: మే 7, 2026
- తమిళనాడు: మే 10, 2026
- అస్సాం: మే 20, 2026
- కేరళ: మే 23, 2026 . పుదుచ్చేరి: జూన్ 15, 2026
మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జరిగింది. ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్. ఈ దఫా పశ్చిమబెంగాల్‌లో మరిన్ని చర్యలు తీసుకోబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2021లో 294 నియోజకవర్గాలకు గాను 160 మంది సాధారణ పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం.. — ఈ సారి ప్రతి నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకుడిని నియమించబోతోంది ఎన్నికల సంఘం.
పశ్చిమ బెంగాల్‌లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న.. కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఇవాళ డేట్స్ ఫిక్స్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
Published On - Mar 15,2026 3:07 PM




