COVID 19 Vaccination: భారత్ ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌.. 18కోట్లకు చేరువలో టీకాల పంపిణీ.. !

అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు ప్రభుత్వ నినాదం. దీనికి టీవీ9 కూడా తోడైంది. దేశం విధానం. దేశంలో టీకా యజ్ఞం కొనసాగుతోంది.

COVID 19 Vaccination:  భారత్ ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌.. 18కోట్లకు చేరువలో టీకాల పంపిణీ.. !
Corona Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: May 14, 2021 | 1:54 PM

India covid vaccination: దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతం మనముందున్న ప్రథమ కర్తవ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు ప్రభుత్వ నినాదం. దీనికి టీవీ9 కూడా తోడైంది. దేశం విధానం. దేశంలో టీకా యజ్ఞం కొనసాగుతోంది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. అంతే వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్ అందాలంటోంది టీవీ9. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ అందింది? ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య ఎంత? తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది? ఇప్పుడు ఆ లెక్కలు చూద్దాం.

దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వరకు వ్యాక్సిన్‌ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 17 కోట్ల 92 లక్షల 98 వేల 584 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 13 కోట్ల 92 లక్షల 78 వేల 403 మందికి డోస్‌1 అందగా.. 4 కోట్ల 5 లక్షల 79 వేల 158 మందికి డోస్‌2 కూడా పూర్తైంది. ఇవాళ 1 లక్షా 94 వేల 628 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 75 లక్షల 58 వేల 97 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 54 లక్షల 71 వేల 553 మందికి డోస్‌1 అందగా.. 20 లక్షల 86 వేల 544 మందికి డోస్‌2 కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54 లక్షల 89 వేల 361 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో డేస్1 పూర్తైన వారు 44 లక్షల 44 వేల 315 మంది. డోస్‌2 పూర్తైన వారు 10 లక్షల 45 వేల 46 మంది. ఇవి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో అందిన డోస్‌ల వివరాలు

ఇక దేశ వ్యాప్తంగా రెండు కంపెనీల వ్యాక్సిన్లు మనకు అందుతున్నాయి. అందులో ఏ కంపెనీ నుంచి ఎన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాయి అనే వివరాలు చూస్తే.. 16 కోట్ల 7 లక్షల 71 వేల 791 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ అందగా.. కోటి 79 లక్షల 11 వేల 163 మందికి కోవాగ్జిన్ డోసులు అందాయి.

ఇక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 20 కోట్ల 82 లక్షల 1 వేల 702 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 7 కోట్ల 21 లక్షల 72 వేల 276 మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 13 కోట్ల 60 లక్షల 29 వేల 425 మంది 45 ఏళ్ల పై బడిన వారే కావడం విశేషం.

ఇదిలావుంటే, దేశంలో 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతీ ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ అందించాలంటే మొత్తం 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరం ఉంది. మన ప్రస్తుతం దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ తోబాటు బయొలాజికల్‌ ఇవాన్స్‌, హాఫ్‌కిన్‌ బయో ఫార్మా, జిఎస్‌కె, మరికొన్ని ఇతర సంస్థలు ఈ వ్యాక్సిన్‌ లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికే ఒక ఏడాదిలో 300 కోట్ల డోసుల ఉత్పత్తి చేయడానికి ఇవి ప్లాను చేసుకుంటున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ రంగ ఫార్మాను కూడా రంగంలోకి దించితే సులువుగా 400 కోట్ల డోసుల ఉత్పత్తి ఒక ఏడాదిలోనే సాధించవచ్చిన నిపుణులు చెబుతున్నారు. మన దేశ అవసరాలు తీర్చడమే గాక ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా సరఫరా చేయగలిగే సత్తా భారత్‌కు ఉందని వైద్యరంగం నిపుణులు చెబుతున్నారు. Read Also.. Ambulance Stopped: కనికరంలేని ఖాకీలు.. తెలంగాణ వైపు అనుమతించని అంబులెన్స్‌లు.. ఉపిరాడక దారిలోనే ఇద్దరు మృతి

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!