Snehalatha Murder : స్నేహలత కుటుంబానికి అండగా ఏపీ సర్కార్.. రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
అనంతపురం జిల్లాలో స్నేహలత అనే యువతి హత్య దుమారాన్ని రేపుతోంది. యువతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో స్నేహలత అనే యువతి హత్య దుమారాన్ని రేపుతోంది. యువతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి కేంద్రంగా ఆందోళనలు భగ్గుమన్నాయి. స్నేహలతను రాజేశ్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని..పైగా నిర్లక్ష్యంగా మాట్లాడరనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఆయనపై అట్రాసిటీ సహా మర్డర్ కేసు నమోదు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
రాజేష్ ఎప్పటి నుంచో స్నేహలతను వేధిస్తున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు పేరెంట్స్. రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే..పొద్దున చూద్దాంలే అని తిప్పి పంపారు. ఉదయం కూతురు చావు కబురు చెప్పారని విలపించారు స్నేహలత పేరెంట్స్. దీంతో సీఐ ప్రతాప్ రెడ్డి నిర్లక్ష్యమే స్నేహలత హత్యకు కారణమని ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. స్నేహలత హత్య కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.
టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహలత తల్లి లక్ష్మిదేవికి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుందన్నారాయన. మరోవైపు స్నేహలత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం జగన్. బాధిత కుటుంబానికి ఇల్లు, ఇంటి స్థలం అందజేస్తామన్నారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచార ఘటనల్లో చట్టపరంగా రూ.8.25 లక్షల పరిహారం అందజేస్తారు. దీనికి సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అదనమని మంత్రి శంకరనారాయణ తెలిపారు. మరోవైపు వేగంగా కేసు దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు ముఖ్యమంత్రి.
Also Read :
Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్
Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది
Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ