New Year Celebrations: కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం… వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్…
సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే కొత్త ఏడాది సంబరాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.
New Year Celebrations: సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే కొత్త ఏడాది సంబరాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా పబ్స్, రెస్టారెంట్ లు వారికి కేటాయించిన టైం ప్రకారమే నడపాలని సూచించారు. ఎక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడానికి అనుమతి లేదని అన్నారు. కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.