రైతులతో ప్రధాని మోదీ ముఖాముఖి, రైతు సమస్యలు, సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దిపై ఆరా

భారతప్రధాని నరేంద్రమోదీ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దికి..

రైతులతో ప్రధాని మోదీ ముఖాముఖి, రైతు సమస్యలు, సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దిపై ఆరా
Follow us

|

Updated on: Dec 25, 2020 | 2:55 PM

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇవాళ నగదు జమకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాల్ని జమచేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2వేల చొప్పున రూ.18,000 కోట్లను డిపాజిట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారతప్రధాని నరేంద్రమోదీ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దికి సంబంధించి నేరుగా రైతుల్నే అడిగితెలుసుకుంటున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ఉపయోగం, రైతు బీమా, ప్రధాన్ మంత్రి ఫసల్ యోజన, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన గురించి రైతులను మోదీ అడుగుతున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం..