Cow Dung Theft :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. కేసు నమోదు… పేడ దొంగల కోసం పోలీసుల గాలింపు!

ఛత్తీస్‌గఢ్‌‌లో దొంగతనం చేసింది ఓ వస్తువు కాదు ఆవు పేడ.. అవునండీ.. దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Cow Dung Theft :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. కేసు నమోదు... పేడ దొంగల కోసం పోలీసుల గాలింపు!
Chhattisgarh Cow Dung Theft Case
Follow us

|

Updated on: Jun 21, 2021 | 10:33 AM

Chhattisgarh Cow Dung Theft Case: దొంగ కన్ను పడితే ఏదైనా మాయం కావల్సింది. అది వస్తువైన ఇంకెదైనా. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దొంగతనం చేసింది ఓ వస్తువు కాదు ఆవు పేడ.. అవునండీ.. దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేడ దొంగ కోసం ఏకంగా గాలింపు చేపట్టారు.

కోర్బా జిల్లాలోని… దీప్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధురెనా గ్రామంలో ఓ కుటుంబం ఆవులను పెంచుకుంటున్నాడు. అయితే, ఇంటి అవరణలోని ఉన్న గొడ్ల చావిటిలో ముద్దగా ఉండాల్సిన ఆవు పేడలో రోజు సగం మాయమవుతోంది. ఇలా రోజు పేడ ఎత్తుకుపోతున్న దొంగల కోసం ఎంత కాపాలా కాసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇరుపొరుగు వారిని విచారించిన అసలు దొంగ దొరకలేదు.

దీంతో ఆ ఇంటి యాజమాని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. పేడ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 8, 9 తేదీల్లో రాత్రివేళ మా ఇంటి గొడ్ల చావిటి దగ్గర ఉంచిన 800 కేజీల పేడను ఎవరో ఎత్తుకు పోయారు. దాని విలువ రూ.1,600. దయచేసి మీరే కాపాడాలి” అంటూ బాధితుడు పోలీసులను వేడుకున్నాడు. పల్లెల్లో పేడ కూడా విలువైనదే కదా… ఆ పేదలకు ప్రతీ రూపాయీ ప్రాణమే కదా… అది గుర్తించిన ఎస్సై… ధైర్యం చెప్పాడు. జూన్ 15న కేసు నమోదైంది. దర్యాప్తు చేసి… దొంగల్ని పట్టుకుంటామని ఎస్సై హామీ ఇచ్చాడు. ఆదివారం నాటికి ఈ విషయం ఊరు దాటి రాష్ట్రం అంతటా తెలిసింది.

ఇదిలావుంటే, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గోదాన్ న్యాయ యోజన అనే పథకం ఒకటి తెచ్చింది. దాని ద్వారా… ప్రజల నుంచి ఆవుపేడను సేకరిస్తోంది. కేజీకి రూ.2 ఇస్తోంది. ఆ పేడతో వర్మీ కంపోస్ట్ తయారుచేయిస్తోంది. అలా ప్రభుత్వానికి పేడ అమ్ముకోవడానికే ఆ పేడను రెడీ చేసి పెట్టుకున్నాడు బాధితుడు. దాన్ని అమ్ముకునే ఉద్దేశంతో… దొంగలు ఎత్తుకుపోయారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పేడ దొంగల కోసం గాలింపు చేపట్టారు.

Read Also…  Srisailam Temple Timings: శ్రీశైల దేవస్థానం దర్శన వేళల్లో మార్పులు.. సాయంత్రం 3గంటల వరకు భక్తులకు అనుమతి..