#Lock-down జిల్లాల సరిహద్దులు మూసేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కఠిన ఆదేశాలను జారీ చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.

#Lock-down జిల్లాల సరిహద్దులు మూసేయండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 5:38 PM

Modi new order to state governments: లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కఠిన ఆదేశాలను జారీ చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రాష్ట్రాల మధ్య వున్న సరిహద్దులను ఇదివరకే మూసేసిన కేంద్రం.. తాజాగా జిల్లాల సరిహద్దులు కూడా మూసేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. కష్టం మరికొంతకాలమేనంటున్న మోదీ సర్కార్.. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయకపోతే.. దేశప్రజలను కాపాడుకోలేమని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను, రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాలను టీవీ9కు వివరించారు. తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో తాను రోజూ టచ్‌లో వున్నానని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ – సోషల్ డిస్టెన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని, రోడ్ల మీదకొచ్చే జనానికి కౌన్సెలింగ్ చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు.

గ్రామాలతో అనుబంధం కారణంగా జనం తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, కరోనా మరణాలపై వార్తలు చూసి సొంతూరికి వెళ్లి, సొంతవారితో ఉండాలని చాలా మంది రోడ్ల మీదకు వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే రాష్ట్ర సరిహద్దులే కాదు, జిల్లా సరిహద్దులు కూడా సీల్ చేయమని రాష్ట్రాలను ఆదేశించామని, ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లపై పెట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలే స్వచ్ఛందంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, పోలీసుల ద్వారా బలవంతంగా అమలు చేయించాల్సిన పరిస్థితి రానీయవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

కరోనా టెస్టింగ్ సామర్థ్యం పెంచుతున్నామని, ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులకు అనుమతి ఇచ్చామని, హైదరాబాద్‌లో 4 ప్రైవేట్ సంస్థలకు టెస్టింగ్ అనుమతినిచ్చామని, ఈఎస్ఐ ఆసుపత్రిలోను పరీక్ష కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు కిషన్ రెడ్డి. మిగతా దేశాల్లో జనాభా తక్కువ.. ప్రభుత్వాల ఆదేశాలు కఠినంగా అమలు చేయడం సాధ్యం అవుతుందని, మన దేశంలో కఠినచట్టాలను అమలుచేయడం కష్టసాధ్యమని ఆయనంటున్నారు.