AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డుపై పిండం చెల్లాచెదురుగా పడి ఉందనుకునేరు.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా

ఉదయాన్నే రైతులు తమ పనులు చేసుకునేందుకు పొలాలకు పయనమయ్యారు. కానీ వారంతా ఓ కూడలి దగ్గరకు చేరుకున్నాక.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Telangana: రోడ్డుపై పిండం చెల్లాచెదురుగా పడి ఉందనుకునేరు.. తీరా దగ్గరకు వెళ్లి చూడగా
Telangana
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 09, 2026 | 10:17 AM

Share

అప్పుడే తెల్లవారింది. జనం పనుల్లో బిజీ అవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రెడి అవుతున్నారు. కానీ.! ఆ రోడ్డుపైన వెళ్లినవారి భయంతో మళ్ళీ వెనక్కి వచ్చారు. రోడ్డుపై ఎటు చూసినా పసుపు.. కుంకుమ.. నిమ్మకాయలు.. వివిధ రకాల బొమ్మలు.. ఇక్కడ.. ఏదో చేశారనే చర్చ సాగింది. అలా ఎందుకు చేశారు. !ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని నీరుకుల్ల గ్రామానికి వెళ్లే రోడ్డుపై క్షుద్రపూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. జిల్లేడు, మోతుకు, బొమ్మిడి మూడు రకాల ఆకులతో విస్తారాకు తయారు చేసి.. అందులో అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి.. నిమ్మకాయ, కోడిగుడ్డు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే పంట పొలాల ప్రాంతాల్లో ఈ క్షుద్రపూజలు చేయడం పట్ల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆది, గురువారాల్లో రాత్రిపూట క్షుద్రపూజలు నీరుకుల్ల రోడ్డులో ఎక్కువగా చేస్తున్నారు భూతవైద్యులు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిపై నుంచి తిప్పి.. వీటిని మూడు, నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డుపై పెడుతున్నారని రైతులు అంటున్నారు. అయితే ఇలాంటి దృశ్యాలు చూసి రైతులు భయపడుతున్నారు. ఉదయం పూట వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను నమ్మొద్దని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాఠశాల విద్య బలోపేతానికి ప్రత్యేక రోడ్ మ్యాప్ః ధర్మేంద్ర ప్రధాన్
పాఠశాల విద్య బలోపేతానికి ప్రత్యేక రోడ్ మ్యాప్ః ధర్మేంద్ర ప్రధాన్
ఏపీ టెట్‌ 2025 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఏపీ టెట్‌ 2025 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 2026..ఆరోగ్య రంగంలో సరికొత
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 2026..ఆరోగ్య రంగంలో సరికొత
అశ్లీల వీడియోలపై సైబర్‌ సెక్యూరిటీ ఉక్కుపాదం.. 24 మంది అరెస్ట్
అశ్లీల వీడియోలపై సైబర్‌ సెక్యూరిటీ ఉక్కుపాదం.. 24 మంది అరెస్ట్
వైభవ్ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!
వైభవ్ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!
వేడి వేడి పనీర్ బ్రెడ్ పకోడీ.. చల్లని వెదర్‌లో పర్ఫెక్ట్ స్నాక్..
వేడి వేడి పనీర్ బ్రెడ్ పకోడీ.. చల్లని వెదర్‌లో పర్ఫెక్ట్ స్నాక్..
'ది రాజాసాబ్' సినిమాకు హీరోగా ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదా?
'ది రాజాసాబ్' సినిమాకు హీరోగా ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదా?
కళ్లు తిరగడం: ప్రమాదకర సంకేతం కావచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి
కళ్లు తిరగడం: ప్రమాదకర సంకేతం కావచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..