Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. ఖర్చులు ఆదా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఇకపై షోరూంలలోనే రిజిస్ట్రేషన్ పూర్తీ చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే. ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..

ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటార్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని RTO కార్యాలయానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989లోని నియమం 48-B ప్రకారం, అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా అమ్మిన వాహనాలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
అవసరమైన డాక్యుమెంట్స్(ఇన్వాయిస్, ఫారం–21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతాయి. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి వస్తుంది. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం, రవాణా ఖర్చులు కొంతమేరకు ఆదా అవుతాయి. RTO కార్యాలయాలకు వెళ్లే అసౌకర్యం తగ్గుతుంది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సౌకర్యం ప్రైవేట్ బైక్‌లు, కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఇది వర్తించదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన, డిజిటల్ సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని రవాణాశాఖ అధికారులు అంటున్నారు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




