తెలంగాణపై బాబు సీరియస్..కొత్త డైరెక్షన్ ఏంటంటే ?

టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణా పాలిటిక్స్‌పై దృష్టి సారించారు. ప్రతీ శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో మకాం వేస్తున్న చంద్రబాబు ఈ శనివారం తెలంగాణ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. గతనెల రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితిని, ప్రభుత్వ వైఖరిని, కెసీఆర్ వ్యూహాన్ని, కార్మిక సంఘాల భవిష్యత్ కార్యాచరణల గురించి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ తదితరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ కొనసాగించడంపై సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. […]

తెలంగాణపై బాబు సీరియస్..కొత్త డైరెక్షన్ ఏంటంటే ?
Follow us

|

Updated on: Nov 02, 2019 | 7:53 PM

టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణా పాలిటిక్స్‌పై దృష్టి సారించారు. ప్రతీ శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో మకాం వేస్తున్న చంద్రబాబు ఈ శనివారం తెలంగాణ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. గతనెల రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితిని, ప్రభుత్వ వైఖరిని, కెసీఆర్ వ్యూహాన్ని, కార్మిక సంఘాల భవిష్యత్ కార్యాచరణల గురించి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ తదితరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ కొనసాగించడంపై సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ పర్ఫార్మెన్స్‌పై కూడా చంద్రబాబు చర్చించారు. ఆర్టీసీ సమ్మెలో టిడిపి వర్గాల భాగస్వామ్యం పెంచాలని రమణను ఆదేశించారు చంద్రబాబు. తెలంగాణలోపార్టీ అంతరించిపోతుందన్న ప్రచారాన్ని ధీటుగా తిప్పి కొట్టాలని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను పెంచాలని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

త్వరలో జరిగే మునిసిపిల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు చెప్పారు. పార్టీకి ఒకప్పుడు అండగా వున్న వర్గాలను తిరిగి పార్టీ వైపు తీసుకురావాలని సూచించారు. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నినిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో ముందుగా కమిటీలను వేద్దామని ఆయన చెప్పినట్లు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణ చెబుతున్నారు.

ప్రతీ వీకెండ్ ‌చంద్రబాబు హైదరాబాద్‌కు రావడం, ఎన్టీయార్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ నాయకులకు, పార్టీ వర్గాలకు అందుబాటులో వుండడం సంతోషంగా వుందని, పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని రమణతోపాటు పలువురు తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!