బిగ్ బాస్ 3 విన్నర్‌గా రాహుల్..? జగన్ ఎలా హెల్ప్ అయ్యాడు..?

బిగ్ బాస్..బిగ్ బాస్..బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగు ప్రజలను ఎక్కడ కదిలించినా ఇదే పదం వినిపిస్తోంది. ఫస్ట్‌లో పెద్దగా అటెన్షన్ గ్రాబ్ చెయ్యలేకపోయిన ఈ రియాలిటీ షో..వీక్ వైజ్ వీక్ స్లోగా పుంజుకుంది.  ఫైనల్‌లో మొయిన్‌గా యాంకర్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అవ్వడంతో విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే విషయం సస్పెన్స్‌గా మారింది.  బిగ్ బాస్ హౌస్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరొందిన వరుణ్ సందేశ్‌ని వెనక్కి […]

బిగ్ బాస్ 3 విన్నర్‌గా రాహుల్..? జగన్ ఎలా హెల్ప్ అయ్యాడు..?
Ram Naramaneni

|

Nov 03, 2019 | 5:22 PM

బిగ్ బాస్..బిగ్ బాస్..బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగు ప్రజలను ఎక్కడ కదిలించినా ఇదే పదం వినిపిస్తోంది. ఫస్ట్‌లో పెద్దగా అటెన్షన్ గ్రాబ్ చెయ్యలేకపోయిన ఈ రియాలిటీ షో..వీక్ వైజ్ వీక్ స్లోగా పుంజుకుంది.  ఫైనల్‌లో మొయిన్‌గా యాంకర్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అవ్వడంతో విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే విషయం సస్పెన్స్‌గా మారింది.  బిగ్ బాస్ హౌస్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరొందిన వరుణ్ సందేశ్‌ని వెనక్కి నెట్టి.. తొలి నుండి టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న శ్రీముఖితో ఢీ కొడుతున్నాడు రాహుల్ సిప్లిగంజ.

అయితే  శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లను విన్నర్‌‌ను చెయ్యడం వారి ఫ్యాన్స్ ప్రస్టేజ్‌గా తీసుకున్నారు. ఇందుకోసం స్పెషల్‌గా ఓటింగ్ డ్రైవ్‌ను చేపట్టారు. పాత బస్తీ కుర్రోడిని.? హైదరబాదీలు గెలిపించుకోవాలంటూ..సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ చేశారు. అంతేకాదు రాహుల్ సిప్లిగంజ్..ఎన్నికలకుముందు జగన్‌ ఇమేజ్‌ను హైలెట్ చేస్తూ అదిరిపోయే రేంజ్‌లో పాట పాడాడు. ఆ సాంగ్ జగన్ ఫ్యాన్స్‌ను భీభత్సంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు రాహుల్‌కి జగన్ ఫ్యాన్స్ అంతా గంపగుత్తగా ఓట్లు వేశారంట. దీంతో సీఎం జగన్ సపోర్ట్‌తో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ని ముద్దాడటం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. మరి కొన్ని గంటల్లో ఈ ఊహాగానాలకు తెరపడబోతుంది. సో..లెట్స్ వెయిట్ అండ్ సీ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu