భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్..!! పప్పుకి సారీ చెప్పిన తమన్నా..!
మరో కొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి రేటింగ్‌తో స్టార్ మా టీవీ ఛానెల్‌లో దూసుకెళ్తోంది బిగ్‌బాస్ 3. కాగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో.. ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సమాధానానికి.. ఆదివారం తెరపడనుంది. ఎవరా ‘టైటిల్ విన్నర్’ అని అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు బిగ్‌బాస్ సీజన్ 1, 2 కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో.. ఐదుగురు కంటెస్టెంట్స్.. బాబా మాస్టర్, ఆలీ, రాహుల్ […]
మరో కొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి రేటింగ్‌తో స్టార్ మా టీవీ ఛానెల్‌లో దూసుకెళ్తోంది బిగ్‌బాస్ 3. కాగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో.. ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సమాధానానికి.. ఆదివారం తెరపడనుంది. ఎవరా ‘టైటిల్ విన్నర్’ అని అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు బిగ్‌బాస్ సీజన్ 1, 2 కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో.. ఐదుగురు కంటెస్టెంట్స్.. బాబా మాస్టర్, ఆలీ, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శ్రీముఖిలు ఉన్నారు.
అయితే.. గత రెండు సీజన్స్‌లాగే.. ఈ సారి కూడా ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్‌లను తిరిగి.. హౌస్‌లోకి పంపించారు బిగ్‌బాస్. ఒకరి తర్వాత మరొకరు వస్తూ.. హౌస్‌లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్స్‌లకు షాక్ ఇచ్చారు. దీంతో.. అందరూ ఒక దగ్గరకు చేరి పాతస్మృతులను గుర్తు చేసుకున్నారు. హ్యాపీగా.. హౌస్‌లో గడిపారు. వారి వారి ఇష్టమైన హౌస్‌మేట్స్ రావడంతో.. మిగిలిన కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ టైంలోనే.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరికీ.. ఓ వీడియో చూపించారు. అందులో.. షో మొదలైన కాన్నుంచీ.. ఎండింగ్ వరకూ.. హౌస్‌లో జరిగిన ప్రతీ సన్నివేశాన్ని చూపించాడు బిగ్‌బాస్. దీంతో.. హౌస్‌మేట్స్ అందరూ ఒకేసారి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా.. తమన్నా.. ఏడ్చి.. రవి అలియాస్ పప్పుకి సారీ చెప్పింది. ఇదంతా నేను కావాలని చేయలేదు.. గేమ్‌లో అది ఒక స్ట్రాటజీ.. దానికి నువ్వు బలయ్యావ్.. ఐ యామ్ వెరీ సారీ.. అంటూ.. మరింత భావోద్వేగానికి గురయ్యింది. దీంతో.. హౌస్‌మెంట్స్ అందరూ.. ఆమె పేరును అరుపులతో.. కేకలతో.. హోరెత్తించారు.