బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్ల రచ్చ..! షాక్‌లో ప్రేక్షకులు..?

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3.. మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో.. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో కూడా.. బిగ్‌బాస్ విన్నర్ ఫలానా అని ఫ్యాన్స్ ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం.. బాబా మాస్టర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, ఆలీ.. టైటిల్ విన్నర్ రేసులో ఉన్నారు. అయితే.. గత రెండు సీజన్స్‌లాగే.. ఈ సారి కూడా బిగ్‌బాస్.. ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్‌లను […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:15 am, Sat, 2 November 19
బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్ల రచ్చ..! షాక్‌లో ప్రేక్షకులు..?

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3.. మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో.. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో కూడా.. బిగ్‌బాస్ విన్నర్ ఫలానా అని ఫ్యాన్స్ ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం.. బాబా మాస్టర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, ఆలీ.. టైటిల్ విన్నర్ రేసులో ఉన్నారు.

అయితే.. గత రెండు సీజన్స్‌లాగే.. ఈ సారి కూడా బిగ్‌బాస్.. ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్‌లను తిరిగి.. హౌస్‌లోకి పంపించారు. ఒకరి తర్వాత మరొకరు వస్తూ.. హౌస్‌లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్స్‌లకు షాక్ ఇచ్చారు. దీంతో.. అందరూ ఒక దగ్గరకు చేరి పాతస్మృతులను గుర్తు చేసుకున్నారు. హ్యాపీగా.. హౌస్‌లో గడిపారు. వారి వారి ఇష్టమైన హౌస్ మెంట్స్‌ రావడంతో.. మిగిలిన కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఏదేమైనా.. హౌస్‌లోని 15 మంది కంటెస్టెంట్స్ ఒక దగ్గరకు చేరేసరికిగా.. ఇళ్లంతా రచ్చ రచ్చగా మారింది. అరుపులు, కేకలతో.. హౌస్‌ అంతా హోరెత్తింది. దీంతో.. బిగ్‌బాస్ హౌస్‌లో.. పండుగ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా.. వీరందరికీ.. బిగ్‌బాస్ ఓ ప్రైవేట్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. దీంతో.. హౌస్‌మెంట్స్ ఓ రేంజ్ తయారై.. పార్టీకి రెడీ అయ్యారు. ఇందులో అందరూ.. డ్యాన్స్‌లతో.. నవ్వులతో మెరిసిపోయారు. కాగా.. బిగ్‌బాస్.. ఇక్కడ కూడా ఓ టాస్క్ కంటెస్టెంట్ చేశారు. అందులో.. ఎవరు ఎందులో ఘనాపాఠినో.. వారికి అవార్డులు పురస్కారం చేయాలని చెప్పాడు. అయితే.. ఇది ఎక్స్‌పెక్ట్ చేయని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు.