శ్రీముఖి గెలుపు కోసం ప్రముఖ నిర్మాత ఏం చేశాడంటే..?
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి ఈరోజు చివరి రోజు. ఈ సీజన్ విజేత ఎవరనేది రేపు తెలిసిపోతుంది. హౌస్‌లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యుల తరపున వారి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిన్నటి వరకు ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి ఫ్యాన్స్ రచ్చ అయితే మాములుగా లేదు. ఒకవైపు సామజిక మాధ్యమాల్లో.. మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేశారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ […]
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి ఈరోజు చివరి రోజు. ఈ సీజన్ విజేత ఎవరనేది రేపు తెలిసిపోతుంది. హౌస్‌లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యుల తరపున వారి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిన్నటి వరకు ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి ఫ్యాన్స్ రచ్చ అయితే మాములుగా లేదు. ఒకవైపు సామజిక మాధ్యమాల్లో.. మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేశారు.
శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్‌లు విక్టరీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఎవరిని విజేతగా అనౌన్స్ చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు వీరందరిని శ్రీముఖి పూర్తిగా డామినేట్ చేసిందని చెప్పొచ్చు. షోలోకి అడుగుపెట్టక ముందే ‘శ్రీముఖి ఆర్మీ’ పేరిట గ్రూపులు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు యాంకరమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకుంటూ వచ్చింది ఈ ఆర్మీ. ఇక ఇప్పుడు ఈ యాంకర్ కోసం పలువురు సైతం ప్రచారం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. అంతేకాదు ప్రత్యేకించి ఆమె గెలుపు కోసం ఓ నిర్మాత పూజలు కూడా చేయించారన్నది పెద్ద ట్విస్టు.
మరోవైపు ఆ నిర్మాత వాట్సాప్ గ్రూపుల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశారట. దీని బట్టి యాంకర్ శ్రీముఖికి మిగతా వారికంటే ఎక్కువగా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉందని.. ఈ సన్నివేశం చెప్పకనే చెబుతోంది. అయితే ఆ నిర్మాత కేవలం స్నేహం కోసమే ప్రచారం చేశాడా.? లేక శ్రీముఖి గెలిచిన తర్వాత ఏదైనా సాయం ఆశించాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.