బిగ్‌బాస్‌లోకి పునర్నవి.. రాహుల్ రియాక్షన్ చూడాల్సిందే..!!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్3 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా 103 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శుక్రవారం నాటితో 104వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఇక మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను ఒకటి “స్టార్ మా” ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఈ ప్రోమోలో సభ్యులు ఒకరిపై మరొకరు జోకులేసుకుంటూ.. సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు. ఈ షో ప్రారంభంలో మొత్తం […]
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్3 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా 103 ఎపిసోడ్‌లను పూర్తి చేసి శుక్రవారం నాటితో 104వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఇక మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను ఒకటి “స్టార్ మా” ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఈ ప్రోమోలో సభ్యులు ఒకరిపై మరొకరు జోకులేసుకుంటూ.. సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు.
ఈ షో ప్రారంభంలో మొత్తం 15మంది ఉండగా.. ప్రస్తుతం అయిదుగురు మాత్రమే హౌస్‌లో మిగిలారు. ఫైనల్ బరిలో శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్‌ల మధ్య పోటీనెలకొంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు రెండు రోజుల ముందు మిగిలి ఉన్న అయిదుగురు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్.. బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా.. పాత సభ్యులందరినీ బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించారు. రవి, జాఫర్, అషు, రోహిణి, తమన్నా, పునర్నవి, వితిక, శివజ్యోతి, హిమజ, హేమ హౌస్‌లోకి వెళ్లి తమ మిత్రులను కలిశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో సభ్యుల మధ్య సందడి నెలకొంది. ఎప్పటిలానే తమన్నా సింహాద్రి.. రవిని టీజ్ చేస్తూ కనిపించింది. ఇక బిగ్‌బాస్ రొమాంటిక్ కపుల్.. పునర్నవి-రాహుల్ సందడి చేశారు. పునర్నవిని శ్రీముఖి ఎత్తుకొని హౌస్‌లోకి తీసుకొస్తుండగా.. అదే సమయంలో రాహుల్ పునర్నవిని హగ్‌చేసుకుంటూ.. దగ్గరికి తీసుకుంటూ కనిపించాడు. ఇక పాత సభ్యులంతా హౌస్‌లో ఏం చేశారన్నది ఇవాళ్టి ఎపిసోడ్‌లో తేలనుంది.
Reunion is going to be BIGG & Happy!!!#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/Q5jWvbofJm
— STAR MAA (@StarMaa) November 1, 2019