పున్నూతో మూవీ.. రాహుల్ హ్యాపీ.. హ్యాపీ..?

మొత్తానికి ‘బిగ్‌బాస్ 3 విన్నర్ టైటిల్‌’ సాధించాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఒక్కసారి కూడా.. ఇంట్లో కెప్టెన్‌ కాని.. రాహుల్.. ఏకంగా బిగ్‌బాస్ సీజన్‌ 3కి టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అందులోనూ.. రొమాంటిక్ పర్సన్‌గా కూడా మనోడికి మంచి టాక్ ఉంది. అలాగే.. బిగ్‌బాస్ సీజన్ 3‌లో పునర్నవి భూపాలం-రాహుల్ సిప్లిగంజ్‌లకు ‘రొమాంటిక్ జోడి’గా కూడా పేరొచ్చింది. అసలు వీరి రొమాన్స్‌ కోసమే.. చాలా మంది బిగ్‌బాస్ చూసేవారని.. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే.. మీరు […]

పున్నూతో మూవీ.. రాహుల్ హ్యాపీ.. హ్యాపీ..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 11, 2019 | 2:18 PM

మొత్తానికి ‘బిగ్‌బాస్ 3 విన్నర్ టైటిల్‌’ సాధించాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఒక్కసారి కూడా.. ఇంట్లో కెప్టెన్‌ కాని.. రాహుల్.. ఏకంగా బిగ్‌బాస్ సీజన్‌ 3కి టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అందులోనూ.. రొమాంటిక్ పర్సన్‌గా కూడా మనోడికి మంచి టాక్ ఉంది. అలాగే.. బిగ్‌బాస్ సీజన్ 3‌లో పునర్నవి భూపాలం-రాహుల్ సిప్లిగంజ్‌లకు ‘రొమాంటిక్ జోడి’గా కూడా పేరొచ్చింది. అసలు వీరి రొమాన్స్‌ కోసమే.. చాలా మంది బిగ్‌బాస్ చూసేవారని.. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే.. మీరు నిజంగానే లవ్ చేసుకుంటున్నారా..? అంటూ రాహుల్‌ను అడగగా.. అదంతా ట్రాష్ అని.. క్లారిటీ ఇస్తూ.. తమ రొమాన్స్‌  కేవలం ఫ్రెండ్‌ఫిప్ అని తేలిగ్గా కొట్టిపారేశాడు. తాజాగా.. వీరు ఇప్పుడు బుల్లితెరపై చాలా షోలలో దర్శనమిస్తూ.. కనువిందు చేస్తున్నారు.

మళ్లీ ఇప్పుడు వీరి గురించి టాపిక్.. ఎందుకు వచ్చిందంటే.. ఈ జంటపై.. దర్శక-నిర్మాతల కన్ను పడిందట. ఎలాగో.. బిగ్‌బాస్‌ 3షోతో ఫేమ్ అయిన వీరిద్దరి జోడీతో సినిమా తీస్తే.. అది ఖచ్చితంగా హిట్‌ అవుతుందని.. వారి నమ్మకమట. దీంతో.. అప్పుడే కసరత్తులు కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. ఓ టీవీ ఛానెల్లో ఇంటర్య్వూ ఇచ్చిన రాహుల్‌ని.. పునర్నవితో సినిమా చేసే అవకాశం వస్తే అందులో.. మీరు హీరోగా నటిస్తారా..? అంటూ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. రాహుల్.. ‘ఖచ్చితంగా నటిస్తాను’. అందులోనూ.. పున్నూ బేబీతో సినిమా అవకాశం వస్తే.. 100కి 110 పర్సెంట్ ఐయామ్ ‘రెడీ’ అంటూ పక్కా స్టేట్ మెంట్ ఇచ్చాడు.

మొత్తానికి ఈ క్రేజీ కాంబోతో సినిమా చేసే అవకాశమే.. వస్తే.. అందుకు అవసరమైన కథ కోసం దర్శక-నిర్మాతలు అప్పుడే పాట్లు పడుతున్నారట. అలాగే.. పున్నూ కూడా రాహుల్‌తో సినిమా అనేసరికి సై అంటుందని సమాచారం. సహజంగానే వీరి జోడీతో కూడిన రొమాంటిక్ మూవీ 100 శాతం సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.