‘సాహో’ షాకిచ్చినా.. ప్రభాస్ తగ్గనంటున్నాడా..!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తరువాత రెబల్‌స్టార్‌కు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే అక్కడకు వెళ్లేందుకు అంత ఆసక్తిని చూపని ప్రభాస్… టాలీవుడ్‌కే మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఇక్కడే ఉండిపోయాడు. కానీ అతడికున్న క్రేజ్‌ దృష్ట్యా ‘సాహో’ను బహు భాషల్లో తెరకెక్కించిన దర్శకనిర్మాతలు.. నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనూహ్యంగా దక్షిణాది భాషల్లో ‘సాహో’ ఫ్లాప్‌ అవ్వగా.. హిందీలో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. హిందీ […]

'సాహో' షాకిచ్చినా.. ప్రభాస్ తగ్గనంటున్నాడా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 11, 2019 | 1:58 PM

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తరువాత రెబల్‌స్టార్‌కు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే అక్కడకు వెళ్లేందుకు అంత ఆసక్తిని చూపని ప్రభాస్… టాలీవుడ్‌కే మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఇక్కడే ఉండిపోయాడు. కానీ అతడికున్న క్రేజ్‌ దృష్ట్యా ‘సాహో’ను బహు భాషల్లో తెరకెక్కించిన దర్శకనిర్మాతలు.. నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనూహ్యంగా దక్షిణాది భాషల్లో ‘సాహో’ ఫ్లాప్‌ అవ్వగా.. హిందీలో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. హిందీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ‘సాహో’ కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్‌ విమర్శకులు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. అక్కడ ఈ చిత్రం హిట్ మూవీ లిస్ట్‌లో చేరిపోయింది.

అయితే ‘సాహో’ ఇచ్చిన షాక్‌తో ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధంగా లేడని వార్తలు వచ్చాయి. అందుకే ఈ మూవీకి బడ్జెట్‌ను తగ్గించారని, నటీనటుల విషయంలో కూడా దక్షిణాదివారినే తీసుకుంటున్నాడని పుకార్లు వినిపించాయి. ఈ క్రమంలో దీనిపై నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ 20వ చిత్రం కూడా బహుభాషా చిత్రమేనని ఆయన ఓ స్పష్టతను ఇచ్చాడు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్‌పై కూడా ఎస్కేఎన్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రభాస్ 20వ చిత్రానికి సెట్ వర్క్ జరుగుతోందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అతడు పేర్కొన్నాడు. దీంతో ప్రభాస్ 20వ మూవీపై ఓ అనుమానం తీరినట్లైంది.

కాగా ఈ మూవీ విషయంలో ప్రభాస్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ‘సాహో’ను తెరకెక్కించారని అప్పట్లో వార్తలు రాగా.. తన 20వ సినిమా విషయంలో మాత్రం అలాంటి టాక్ రాకూడదని అనుకుంటున్నాడట. ఇందులో భాగంగా దక్షిణాది ఫ్లేవర్ పోకుండా.. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలని దర్శకుడికి సూచించాడట. దీంతో స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు  తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు టాక్. మొత్తానికి ‘సాహో’ ఫ్లాప్‌తో కాస్త డీలా పడ్డ ప్రభాస్.. ఈసారి మాత్రం హిట్ కొట్టాలన్న కసితో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే రొమాంటిక్ ప్రేమ కథగా ప్రభాస్ 20వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. గోపికృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu