‘పేరడీ’ల వర్మ.. ఇదెక్కడి ‘మర్మం’..?

రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడీయన వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా… ఒకప్పుడు మాత్రం క్రియేటివ్ డైరక్టర్. పలు సంచలన చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. అయితే రాను రాను ఆయన గ్రాఫ్ పడిపోవడంతో పాటు… వివాదాస్పద అంశాలనే తన సినిమా కథలుగా ఎంచుకుంటూ కాంట్రవర్సియల్ డైరక్టర్‌గా మారిపోయాడు. ఇలా మారిపోయిన వర్మ ఇటీవల తెరకెక్కించిన మరో వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఏపీలోని రాజకీయాలపై ఈ సినిమాను […]

'పేరడీ'ల వర్మ.. ఇదెక్కడి 'మర్మం'..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Nov 11, 2019 | 5:15 PM

రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడీయన వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా… ఒకప్పుడు మాత్రం క్రియేటివ్ డైరక్టర్. పలు సంచలన చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. అయితే రాను రాను ఆయన గ్రాఫ్ పడిపోవడంతో పాటు… వివాదాస్పద అంశాలనే తన సినిమా కథలుగా ఎంచుకుంటూ కాంట్రవర్సియల్ డైరక్టర్‌గా మారిపోయాడు. ఇలా మారిపోయిన వర్మ ఇటీవల తెరకెక్కించిన మరో వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.

ఏపీలోని రాజకీయాలపై ఈ సినిమాను తెరకెక్కించిన ఆయన.. ఇందులో చంద్రబాబు నాయుడు, జగన్, నారా లోకేష్, కేఏ పాల్, వంగవీటి రాధా తదితర రాజకీయ నాయకుల పాత్రలను చూపించాడు. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు విడుదల తేదీని ప్రకటించని వర్మ.. ప్రమోషన్లను మాత్రం ఓరేంజ్‌లో చేస్తున్నాడు. మొదట టీజర్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ… ఆ తరువాత ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. అందులో కేఏ పాల్‌పై సాగే… ‘నేనే కేఏ పాల్’ పాట ఒకటి కాగా, నారా లోకేష్‌పై సాగే.. ‘పప్పు లాంటి అబ్బాయి’ మరొకటి. కాగా ఇవి రెండు పాటలు.. టాలీవుడ్‌లో ఇది వరకు వచ్చిన పాటలకు పేరడీ కావడం విశేషం. ‘నేనే కేఏ పాల్’ సాంగ్ ‘హృదయకాలేయం’లోని ‘నేనే సంపు’ పాటకు పేరడీ కాగా.. ‘పప్పు లాంటి అబ్బాయి’ సాంగ్ ‘అభినందన’ చిత్రంలోని ‘చుక్కలాంటి అమ్మాయి’ పేరడీ. పాట మొత్తం కాకపోయినా.. అవే ట్యూన్లతో తన సినిమాలోని పాటలను తెరకెక్కించాడు వర్మ. దీంతో క్రియేటివ్ వర్మ.. పేరడీగా మారిపోయాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వర్మ.. పాటలను రీమేక్ చేయడం గానీ.. పేరడీలు చేయడం గానీ చేయలేదు. అలాంటిది ఓ వివాదాస్పద చిత్రం కోసం వర్మ ఇప్పుడు పేరడీలు చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదిలా ఉంటే ఈ ‘పేరడీ రీమేక్’ల వెనుక వర్మ స్ట్రాటెజీ ఏంటన్నది మాత్రం ఇప్పటికీ అందరిలో ఓ ప్రశ్నగా మిగిలింది.