సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి

సీఎం జగన్..ఆయన తండ్రి వైఎస్సార్ బాటలో పయనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేసిన..తన వెంటే ఉన్నవాళ్లకి..అధికారంలోకి వచ్చాక పదువులు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు అనేకమంది సినీ తారలు జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. జగన్.. సీఎం అయిన తర్వాత వారిని  ఒక్కొక్కరిని పిలిచి కీలక పదవులు కట్టుబెడుతున్నారు. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండష్ట్రీ పృథ్వీని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ తెలుగు […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:16 am, Tue, 12 November 19
సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి

సీఎం జగన్..ఆయన తండ్రి వైఎస్సార్ బాటలో పయనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేసిన..తన వెంటే ఉన్నవాళ్లకి..అధికారంలోకి వచ్చాక పదువులు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు అనేకమంది సినీ తారలు జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. జగన్.. సీఎం అయిన తర్వాత వారిని  ఒక్కొక్కరిని పిలిచి కీలక పదవులు కట్టుబెడుతున్నారు. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండష్ట్రీ పృథ్వీని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీ పార్వతి ఇటీవల నియమితులయ్యారు.

తాజాగా జగన్ పార్టీ పెట్టిన దగ్గర్నుంచి వెన్నంటే ఉన్న సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి వరించింది. విజయ్ చందర్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. అటు రాష్ట్ర అధికార భాషా సంఘానికి సైతం సర్కారు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇక మరికొందరు సినీ నటులు మోహన్ బాబు, పోసాని, అలీ, కృష్ణుడు, జయసుధలకు సీఎం జగన్ ఏం పదవులు ఇస్తారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు :

మోదుగుల పాపిరెడ్డి

ఆచార్య షేక్ మస్తాన్

ఆచార్య చందూ సుబ్బారావు

ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి