టాలీవుడ్‌లో పై చేయి స్వీటీదేనట..!

వారి మత్తెక్కించే అందాలతో.. హీరోలకి ధీటుగా.. నటిస్తూ.. ఫ్యాన్స్‌ని మెప్పిస్తారు హీరోయిన్స్. అందులోనూ.. హీరోయిన్స్.. వాళ్ల స్టార్‌డమ్‌ని నిలబెట్టుకొని ఇండస్ట్రీలో ఉండేది చాలా తక్కువ. కొంతమంది హీరోయిన్స్‌ అయితే.. ఒకటి రెండు సినిమాలు చేసి.. మెరుపు తీగల్లాగ మాయమవుతూంటారు. కానీ.. అందరికీ ధీటుగా.. అన్నీ తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడ్డ హీరోయిన్స్ చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్కపెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం […]

టాలీవుడ్‌లో పై చేయి స్వీటీదేనట..!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 11:43 AM

వారి మత్తెక్కించే అందాలతో.. హీరోలకి ధీటుగా.. నటిస్తూ.. ఫ్యాన్స్‌ని మెప్పిస్తారు హీరోయిన్స్. అందులోనూ.. హీరోయిన్స్.. వాళ్ల స్టార్‌డమ్‌ని నిలబెట్టుకొని ఇండస్ట్రీలో ఉండేది చాలా తక్కువ. కొంతమంది హీరోయిన్స్‌ అయితే.. ఒకటి రెండు సినిమాలు చేసి.. మెరుపు తీగల్లాగ మాయమవుతూంటారు. కానీ.. అందరికీ ధీటుగా.. అన్నీ తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడ్డ హీరోయిన్స్ చాలా అరుదు అనే చెప్పాలి.

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్కపెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యున‌రేష‌న్స్ అందుకుంటున్నారు. ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది స్వీటీ అలియాస్ అనుష్క. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.

ఇక న‌య‌న‌తార కూడా అంతే.. ఈమె కూడా ఒక్కో సినిమాకు 4 నుంచి 7 కోట్ల పారితోషికం అందుకుంటుంది. సైరా కోసం 7 కోట్ల వ‌ర‌కు న‌య‌న‌తారకు ఇచ్చార‌ని టాక్. ఇక స‌మంత అక్కినేని కూడా దుమ్ము దులిపేస్తుంది. ఈమె ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తుంది. మ‌రో బ్యూటీ పూజా హెగ్డే.. సినిమాకు దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వ‌ర‌కు అందుకుంటుంది.

అలాగే.. కాజల్ అగర్వాల్.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ టాలీవుడ్‌లో ఆమె స్టార్ డమ్‌ ఏం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. 34 ఏళ్లు దాటినా.. హొయలొలికించే అందాలతో.. ఈ అమ్మడు ట్రెండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం కాజల్.. కోటిన్నర తీసుకుంటుందని సమాచారం. కాగా.. సాయి పల్లవి, తమన్నా కూడా దాదాపు కోటికి పైగానే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారట. అలాగే.. కైరా అద్వానీ, రాశిఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌లు కోటి తీసుకుంటున్నారు. అయితే.. నయన్ మిగతా భాషల్లో కూడా నటిస్తోంది. నిజానికి ఆమె తమీళియన్. ఈ లెక్కన చూస్తుంటే.. స్వీటీనే.. టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ తీసుకుంటుంది.