Bharat Biotech Covaxin: 14 రాష్ట్రాలకు నేరుగా కోవాగ్జిన్ డోసులు.. ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటెక్‌..!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. కొవాగ్జిన్‌ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు తమను సంప్రదించినట్లుగా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Bharat Biotech Covaxin: 14 రాష్ట్రాలకు నేరుగా కోవాగ్జిన్ డోసులు.. ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటెక్‌..!
Bharat Biotech's Covaxin
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 11, 2021 | 10:57 AM

COVAXIN: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మూడు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతంగా చేయడానికి టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల రాష్ర్టాలకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌తో అయా రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

కొవాగ్జిన్‌ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు తమను సంప్రదించినట్లుగా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం చేసుకున్న 14 రాష్ర్టాలలో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలున్నాయి. ఈ 14 రాష్ర్టాలు కూడా కొవాగ్జిన్‌ను వీలైనంత త్వరగా సరఫరా చేయాలని కోరాయని భారత్‌ బయోటెక్‌ వర్గాలు తెలిపాయి.

దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభాకు సకాలంలో వ్యాక్సిన్లు అందాలంటే టీకాల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందని భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా అభిప్రాయపడ్డారు. యూరోపియన్‌ యూనియన్‌ ఇండియా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కొవాగ్జిన్‌’ టీకాను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దేశంలోని వివిధ రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 14 రాష్ట్రాలకు టీకా అందించటం మొదలు పెట్టినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు నేరుగా టీకా అందించటం మొదలు పెట్టాం’ అని ఆమె వివరించారు. ఇతర రాష్ట్రాలు కూడా టీకా కోసం తమను సంప్రదిస్తున్నట్లు, టీకా లభ్యత ప్రకారం ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

కంపెనీల మధ్య ఒప్పందాలు, సాంకేతికత బదలాయింపు, కీలక యంత్రాల సరఫరా జరిగినప్పుడే టీకాల ఉత్పత్తి పెరుగుతుందని ఆమె చెప్పారు. అదే సమయంలో దేశంలోని టీకా ఉత్పత్తి కంపెనీలకు భారీస్థాయిలో ముడిసరుకును అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా, టీకా అందుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, జమ్ము కశ్మీర్‌, జార్ఘండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో డోసు ‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్రాలకు రూ.400 ధరకు ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Read Also…. Oxygen Shortage: తిరుపతిలో ఘోరం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి