పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..
Follow us

|

Updated on: Jun 07, 2020 | 9:19 PM

నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వీరికి ఇళ్లు నిర్మించేందుకు ఆగష్టు 14న శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఏడాది పాలనలో సీఎం జగన్ పేదల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు. 2023 నాటికి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా జగన్ ముందుకు వెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇక హౌసింగ్ స్కీం కోసం 25,842 ఎకరాల ప్రభుత్వ, 16,078 ఎకరాల ప్రైవేట్ భూములను వినియోగించనున్నట్లు కన్నబాబు తెలిపారు. అంతేకాక భూసేకరణ కోసం రూ. 6500 కోట్లు ఖర్చు చేశామని.. అటు 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు లే ఔట్స్ కూడా సిద్ధం చేశామన్నారు. కాగా, మహిళల పేరు మీదనే ఇళ్ళ స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాబితాలో పేర్లు లేనివారు గ్రామ/ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని.. దీని కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Also Read: 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బోర్డర్‌లో తనిఖీల్లేవు..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

Latest Articles