మందుబాబులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

మందుబాబులకు తెలంగాణ సర్కార్ మరోసారి గుడ్ న్యూస్ అందించింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.

మందుబాబులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
Follow us

|

Updated on: Jun 06, 2020 | 2:36 PM

మందుబాబులకు తెలంగాణ సర్కార్ మరోసారి గుడ్ న్యూస్ అందించింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. గతంలో మద్యం షాపులకు సాయంత్రం 6 గంటల వరకే అవకాశం ఉండగా… కొత్త సడలింపులలో భాగంగా జూన్ 1 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

తాజాగా మరోసారి ఆ సమయాన్ని పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. శుక్రవారం ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన గీత కార్మికులందరికీ శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలన్నారు. అంతేకాక సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాలపరిమితిని పదేళ్ల పాటు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. కాగా, అదనంగా తాటి, ఈత చెట్లను కావాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!