కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్..

ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలందరికి రూ.2.50 లక్షల నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Jun 06, 2020 | 1:13 PM

ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. స్వచ్ఛమైన ప్రేమ.. కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. అందుకే చాలామంది యువత కులాంతర వివాహాలే చేసుకుంటున్నారు. ఇక ఇలా కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలిస్తూ.. కుల రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలందరికి రూ.2.50 లక్షల నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో రూ.50 వేలు ఉన్న ఈ ఆర్ధిక సాయాన్ని ఐదు రేట్లు పెంచి రూ.2.50 లక్షలు చేసింది. దీని కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

వేర్వేరు కులాలకు చెందిన యువతీయువకులు పెళ్లి చేసుకుంటే.. వివాహానికి సంబంధించిన ఆధారాలతో వారు స్థానిక జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సదరు దరఖాస్తును అధికారులు పరిశీలించి.. అర్హులైన జంటల గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. దీనితో ప్రభుత్వం తక్షణమే జంటలు దరఖాస్తుకు జతపరిచిన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు జమ చేస్తారు.

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్…

  1. వివాహం చేసుకున్న వధూవరులవి మూడు ఫోటోలు
  2. ఇద్దరివి కుల ధృవీకరణ పత్రాలు
  3. స్కూల్ టీసీ, పదో తరగతి మార్క్స్ మెమో
  4. వివాహ ధృవీకరణ పత్రం
  5. వివాహం చేసుకున్న జంట జాయింట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్
  6. వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు
  7. ఆదాయ ధ్రువీకరణ పత్రం
  8. ఆధార్‌ కార్డు
  9. రేషన్‌ కార్డు

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..