AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత అమానుషం..ఉద్యోగం కోసం నాన్ననే చంపేశాడు..

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం నాన్న‌నే హ‌త్య చేశాడు ఓ దుర్మార్గ‌పు కొడుకు. కొత్తూరు గ్రామానికి చెందిన ముత్యాల నర్సయ్య(58) గోదావరిఖనిలో సింగరేణి సంస్థ‌లో పంపు అపరేటర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు.

ఎంత అమానుషం..ఉద్యోగం కోసం నాన్ననే చంపేశాడు..
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2020 | 2:13 PM

Share

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం నాన్న‌నే హ‌త్య చేశాడు ఓ దుర్మార్గ‌పు కొడుకు. కొత్తూరు గ్రామానికి చెందిన ముత్యాల నర్సయ్య(58) గోదావరిఖనిలో సింగరేణి సంస్థ‌లో పంపు అపరేటర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. ఆయనకు భార్య తార, ఇద్దరు కుమారులు తిరుపతి(35), రాకేష్‌(32) ఉన్నారు. కాగా న‌ర్స‌య్య‌కు ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ క్ర‌మంలో అనారోగ్య కారణం చూపుతూ(మెడికల్‌ అన్‌ఫిట్‌) కింద గ‌తంలో పెద్ద కొడుక్కి త‌న ఉద్యోగం ఇప్పించేందుకు ప్ర‌య‌త్నించాడు న‌ర్స‌య్య‌. కానీ అవేమీ స‌క్సెస్ కాలేదు. దీంతో ప‌థ‌కం ప్ర‌కారం న‌ర్స‌య్య‌ను హ‌త్య చెయ్యాల‌ని కుటుంబ సభ్యులు డిసైడ‌య్యారు.

తిరుపతి.. గత నెల 23న తల్లిని, తమ్ముడిని గోదావరిఖనిపంపించాడు. 25న కొత్తూరులో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నర్సయ్య మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రిపోయాడు. ఈ సమయంలో పెద్ద కొడుకు తిరుపతి తండ్రి గొంతు నులిమి చంపేశాడు. తరువాత ఏం తెలియన‌ట్టుగా గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. తండ్రి హార్ట్ అటాక్ తో చనిపోయాడంటూ బంధుమిత్రుల‌కు సమాచారం ఇచ్చాడు. అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు.

ఆ ఫిర్యాదుతో దొరికాడు…

తండ్రి ఉద్యోగం త‌న‌కు రావ‌డానికి ఎఫ్‌ఐఆర్‌ అవసరం కావటంతో గత నెల 27న తిరుపతి.. ధర్మారం పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఎక్కువ‌గా మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల త‌న తండ్రి నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఎస్సై ప్రేమ్‌కుమార్ ద‌ర్యాప్తు నిమిత్తం వెంటనే గ్రామానికి వెళ్లారు. చితిపై ఉన్న నర్సయ్య మృతదేహాన్ని పరిశీలించిన అనంత‌రం అనుమానం రావడంతో పోస్టుమార్టం చేయించారు. గొంతు నులమడం వల్లనే నర్సయ్య మ‌ర‌ణించిన‌ట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలిన‌ట్టు తెలిపారు పోలీసులు. కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తండ్రిని హత్య చేసినట్లు తిరుపతి చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

Follow Us