AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. విలక్షమైన నటుడు అతను: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశారు పవన్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్నారు.

ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. విలక్షమైన నటుడు అతను: పవన్ కళ్యాణ్
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2026 | 3:01 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. చివరిగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు ఓజీ 2 సినిమాతో రానున్నారు. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను పవన్ కళ్యాణ్ ఓకే చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఓ స్టార్ హీరో గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఫ్యామిలీ మొత్తం ఓ హీరో కు అభిమానులని అన్నారు పవన్.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. నాని నటించిన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నానికి మా ఫ్యామిలిలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మా చెల్లెలు ఓ సందర్భంగా హడావిడిగా వెళ్తుంటే ఎక్కడికి అని అడిగితే నాని సినిమా రిలీజ్ అయ్యింది వెళ్తున్నాం అని చెప్పింది. అప్పుడే అర్ధమైంది నాకు నానికి మా ఫ్యామిలీలో చాలా మంది అభిమానులు ఉన్నారని. విలక్షణమైన నటుడు నాని” అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. త్వరలోనే ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us