Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • అమరావతి: అచ్చెన్నాయుడు పిటిషన్ పై ముగిసిన విచారణ. ప్రవేట్ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ను కోరిన అచ్చెన్నాయుడు. తీర్పు ను 8వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.
  • ప్రకాశం: ఒంగోలు రిమ్స్‌ దగ్గర ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన... ట్రూనాట్‌ ల్యాబుల్లో టెక్నీషియన్లకు శెలవులు ఇవ్వకుండా పనిచేస్తున్నారంటూ ఆరోపణ... వెంటనే శెలవులు ఇవ్వాలని డిమాండ్‌... ఒంగోలులో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు పాజిటివ్‌, మార్కాపురంలో మరో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కరోనాతో మృతి చెందడంతో ఆందోళనలో ల్యాబ్‌ టెక్నీషియన్లు.
  • అమరావతి : ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ . ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికో ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ .
  • గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్దిని అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు. వీడియోలు చూసిన వారిని లింక్ లు ఓపెన్ చేసిన వారిని కూడ గుర్తించిన పోలీసులు. మరో ఇద్దరు పోలీసులు అదుపులో. ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం.

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించారు.
Free Smart Phones For AP Gurukulam Students, గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రస్తుతం విద్యార్ధులందరూ విద్యను ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద విద్యార్ధులపై ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను అందించనున్నారు. సొసైటీ పరిధిలో 60 వేల మంది విద్యార్ధులు చదువుతుండగా.. వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో మిగిలిన విద్యార్ధులకు ఆన్‌లైన్‌ విద్యలో ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే విశాఖపట్నంలో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరిశుభ్రత, పచ్చదనం మైంటైన్ చేస్తూ.. తొలిస్థానంలో నిలిచే గురుకులానికి రూ. 50 వేలు, రెండో స్థానంలో నిలిచిన గురుకులానికి రూ. 30 వేలు ప్రోత్యాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.

Also Read:

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!

జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్..!

Related Tags