AP Weather Alert: ఉపరితలం ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలలో భారీ వర్షాలకు ఛాన్స్..
AP Weather Alert: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి..
AP Weather Alert: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతుంది. కిలోమీటరు ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు(పైకి) వెళ్ళే కొద్ది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతున్నది. ఇక తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి.. పైన తెలిపిన కోస్తా తమిళనాడులో గల ఉపరితల ఆవర్తనం నుండి ఆగ్నేయ అరేబియా సముద్రము వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య కొనసాగుతోంది. దీని ఫలితంగా రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయంటే.. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది. రేపు దక్షిణ కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలో కురిసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
రాయలసీమ ప్రాంతంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే ఛాన్స్ ఉంది.
Also read:
Uttarpradesh: యువతకు ఉచితంగా టాబ్లెట్లు.. ఆమోదం తెలిపిన యూపీ కేబినెట్..
Cannabis: హైదరాబాద్‌లో గంజాయి కోసం స్టూడెంట్స్ వెంపర్లాట.. ఒక్క రాత్రే 100 మంది అదుపులోకి
Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటించిన కేంద్రం.. ఎంతంటే..?