Bathukamma: తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.. అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారో తెలుసా..
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే అతి పెద్ద పండగ
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే అతి పెద్ద పండగ. తెలంగాణ సాంస్కృతిక వైభవం.. బతుకమ్మ.. గౌరమ్మ అంటూ పల్లె నుంచి పట్టణాల వరకు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ ఎంతో ప్రత్యేకం. తీరొక్క పువ్వును పేర్చి బతుకమ్మను అమ్మవారిగా తలచి దాదాపు తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మాహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. తొమ్మిదిరోజుల పాటు.. ఒక్కోరోజు ఒక్కో అమ్మవారిని పూజిస్తుంటారు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుకొని.. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌరమ్మగా పూజిస్తుంటారు.
ఎంతో ఘనంగా పల్లె, పట్టణం ముస్తాబై బతుకమ్మ పండుగను జరుపుకునే రోజు వచ్చేసింది. ఈరోజు నుంచి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమైన బతుకమ్మ ఉత్సవాలను జరుపుకునేందుకు ఆడపడుచులు సిద్ధమయ్యారు. నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. ఆశ్వయుజ మాసం ఆరంభం.. అమావాస్య రోజు నుంచి బతకుమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగను అమావాస్య రోజు మాత్రమే ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామా.
పూర్వ కాలంలో నవాబులు, పెత్తందార్లు అఘాయిత్యాలకు అమాయక గ్రామీణ ఆడపడుచులు ఎంతో మంది బలైపోయారు. వారి మరణాలకు తలుచుకుంటూ పితృదేవతలకు సమానంగా ఆరాధిస్తుంటారని చెబుతుంటారు. ఆ అమావాస్య రోజునే పితృవులతోపాటు.. ఆ ఆడపడుచులను స్మరించుకునే సంస్కృతిలో భాగంగా అదే రోజు బతుకమ్మ పండగను మొదలు పెట్టడం సంప్రదాయంగా మారిపోయింది. వారిని పార్వతీ అమ్మవారి ప్రతీకలుగా భావిస్తూ.. పెత్తర అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు వేడుకలను నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులపాటు రకరకాల పువ్వులను పేర్చి … బతుకమ్మగా తీర్చిదిద్ది..ఆ శక్తిని ఆవాహన చేసి ఆటపాటలతో అర్పించడం ఆచారంగా మారింది.
ఇక బతుకమ్మ పండగ వెనక… మన చారిత్రక నేపథ్యం కూడా ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో చాళుక్యులు వేములవాడను రాజధానిగా ఉపయోగించేవారు. అయితే జాళుక్యులను జయించిన చోళులు తమ ఆరాధ్య దైవమైన బృహదీశ్వరుణ్ని తంజావూరుకు తరలించుకుపోయి బృహదీశ్వరీ దేవి వియోగ దుఃఖానికి కారణమయ్యారు. ఆ బాధను తలుచుకుని జానపదులు అమావాస్య రోజున అమ్మవారిని పూవ్వుల రూపంలో పేర్చి అశ్రు తర్పణం విడిచి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడడం సంప్రదాయంగా మారిందని కథనాలున్నాయి. అయితే వేములవాడలో ఉన్న రాజన్నను బృహదీశ్వరుడనీ.. రాజరాజేశ్వరి అమ్మవారిని బృహదీశ్వరి అని.. జానపదుల మాటలతో బతుకమ్మగా మారిందని అంటుంటారు. ఇలా ఎన్నో రకాల కథనాలు బతుకమ్మ గురించి ఉన్నాయి. అందుకే తెలంగాణలో బతుకమ్మ పండగును గౌరమ్మగా తలచి జరుపుకుంటారు.
Also Read: SamChaitanya: సమంత-నాగచైతన్య అందుకే దూరమయ్యారు.. మాధవిలత షాకింగ్ కామెంట్స్..
తమ్ముడి కోసం రంగంలోకి అన్న.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీరిలీజ్ గెస్ట్‌గా నాగచైతన్య..