తమ్ముడి కోసం రంగంలోకి అన్న.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీరిలీజ్ గెస్ట్‌గా నాగచైతన్య..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తమ్ముడి కోసం రంగంలోకి అన్న.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీరిలీజ్ గెస్ట్‌గా నాగచైతన్య..
Akhil
Rajeev Rayala

|

Oct 06, 2021 | 12:30 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అఖిల్ కు చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఇక బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించలేక పోయాడు భాస్కర్.. దాంతో భాస్కర్ కు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్..  ఈ సినిమా అల్లు అరవింద్ , దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.

ఇక ఈ సినిమా బన్నీ వాసు.. మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అక్కినేని నాగచైతన్య హాజరుకానున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ – ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరిచిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఆమని – ఈషా రెబ్బా – ఫారియా అబ్దుల్లా – చిన్మయి – వెన్నెల కిషోర్ – మురళీశర్మ – జయప్రకాష్ – అజయ్ – ప్రగతి – అమిత్ తివారి – పోసాని కృష్ణ మురళి – సుడిగాలి సుధీర్ – గెటప్ శ్రీను – అభయ్ ఇతరపాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sanjjanaa Galrani: క్యాబ్ డ్రైవర్ పై కస్సుబుస్సులాడిన హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు.. అసలేమైందంటే..

Akhanda: అఖండ షూటింగ్‌ను పూర్తి చేసిన నటసింహం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా..

Raashi Khanna: ఆ ముగ్గురు హీరోలంటే చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu