AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మఒడి’ లబ్ధిదారుల ఎంపిక.. నేడే ఆఖరు తేదీ.!

నవరత్నాల్లో భాగమైన ‘అమ్మఒడి’ పథకాన్ని భారీ ఎత్తున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించగా.. వారి పేర్ల జాబితాను అన్ని గ్రామాలు,పాఠశాలల్లో పెట్టారు. ఈ పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయించింది. అయితే ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మఒడి’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ […]

'అమ్మఒడి' లబ్ధిదారుల ఎంపిక.. నేడే ఆఖరు తేదీ.!
Ravi Kiran
|

Updated on: Jan 05, 2020 | 11:39 AM

Share

నవరత్నాల్లో భాగమైన ‘అమ్మఒడి’ పథకాన్ని భారీ ఎత్తున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించగా.. వారి పేర్ల జాబితాను అన్ని గ్రామాలు,పాఠశాలల్లో పెట్టారు. ఈ పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయించింది. అయితే ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా, జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మఒడి’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతి ఏటా రూ.15 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం వర్తించాలంటే విద్యార్థులకు హాజరు 75 శాతం ఉండాలి. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా నమోదు చేసుకోని వారు ఉంటే.. సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఈరోజు సాయంత్రం లోపు ఎంతమంది లబ్దిదారులను గుర్తిస్తే అంతమందికీ ఈ పథకం వర్తించనుంది. ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లోకి వేసి.. ఆ తర్వాత ఒకేసారి 9వ తేదీన రూ.15వేలు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Follow Us
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?