మరింత పెరిగిన పెట్రోల్ ధరలు!

గత కొద్ది రోజుల నుంచి హెచ్చు తగ్గుదలకు లోనైన చమురు ధరలు.. ఇప్పుడు మరింత పెరిగాయి. మొత్తానికి 80 రూపాయల గీటు దాటింది. 2019 సంవత్సరంలో.. 80కి అటూ.. ఇటూ ఊగిసలాడుతూ ఉండేది. ఈ కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదలతో పాటు.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ ముడిచమురు స్థావరాలపై దాడి తర్వాత మళ్లీ పెరగడం ఇదే. తాజాగా ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.80.38 కాగా.. లీటర్ […]

మరింత పెరిగిన పెట్రోల్ ధరలు!
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 7:40 AM

గత కొద్ది రోజుల నుంచి హెచ్చు తగ్గుదలకు లోనైన చమురు ధరలు.. ఇప్పుడు మరింత పెరిగాయి. మొత్తానికి 80 రూపాయల గీటు దాటింది. 2019 సంవత్సరంలో.. 80కి అటూ.. ఇటూ ఊగిసలాడుతూ ఉండేది. ఈ కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదలతో పాటు.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ ముడిచమురు స్థావరాలపై దాడి తర్వాత మళ్లీ పెరగడం ఇదే. తాజాగా ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.80.38 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ. 74.75గా ఉంది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.10 పైసలు కాగా.. లీటర్ డీజిల్ రూ. 74.12గా ఉంది. శనివారం ధరలతో పోల్చితే.. పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగాయి.

కాగా.. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో భాగంగా.. మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. బ్యారెల్‌కు 4.5 శాతం పెరిగి 69.20 డాలర్లకు చేరడంతో ఇండియాలో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. దీని కారణంగా.. చమురు ధరలు ప్రతీరోజూ మారుతూంటాయి.

Latest Articles