AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. కేంద్రం నుంచి బిగ్ అప్డేట్.. ఇక నుంచి నిమిషాల్లోనే..

ఈపీఎఫ్‌వో కీలక అప్డేట్ ఇచ్చింది. తప్పుడు మెంబర్ ఐడీలను ఖాతాదారులే ఆన్‌లైన్ ద్వారా డీలింక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ అప్డేట్‌కు సంబంధించి ఎక్స్‌లో కీలక వివరాలు వెల్లడించింది. ఎలా డీలింక్ చేసుకోవాలనే విషయాలను కూడా పొందుపర్చింది. ఎలా చేసుకోవాలనేది ఇందులో చూద్దాం.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. కేంద్రం నుంచి బిగ్ అప్డేట్.. ఇక నుంచి నిమిషాల్లోనే..
Epfo
Venkatrao Lella
|

Updated on: May 26, 2026 | 9:07 AM

Share

ఈపీఎఫ్‌ఓ తమ ఆన్‌లైన్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే అన్నీ పనులు చేసుకునేలా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అసవరం లేకుండా ఆన్‌లైన్ సేవలను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగా ఇటీవల మరో పెద్ద అప్డేట్‌ను ఈపీఎఫ్‌వో విడుదల చేసింది. అదేంటంటే.. తప్పుగా నమోదైన మెంబర్ ఐడీని మీరు సులువుగా డీ లింక్ చేయవచ్చు. కంపెనీలు పొరపాటున మీ యూఏఎన్ నెంబర్‌ను వేరే కంపెనీ లేదా తప్పు మెంబర్ ఐడీకి లింక్ చేస్తే మీరు గుర్తించి నిమిషాల్లోనే డీలింక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి డీలింక్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇందులో చూద్దాం.

సర్వీస్ హిస్టరీ చెక్ చేస్కోండి

తప్పుడు మెంబర్ ఐడీలను మీరు సర్వీస్ హిస్టరీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీరు పని చేయని కంపెనీ పేరు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. తప్పుడు మెంబర్ ఐడీ ఉండటం వల్ల పీఎఫ్ అకౌంట్ బదిలీ చేసుకోవడం, విత్ డ్రా చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులే స్వయంగా తప్పుడు మెంబర్ ఐడీని డీలింక్ చేయవచ్చు. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. గతంలో ఎటువంటి నగదు జమకాని మెంబర్ ఐడీని మాత్రమే తొలగించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ జమ అయినా కూడా మీరు తొలగించవచ్చు.

ఎలా చేయాలంటే..?

– ఈపీఎఫ్‌వో పోర్టల్‌ను సందర్శించండి

-యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి

-హోమ్ పేజీలో వ్యూ అని కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-కేటగిరీలో సర్వస్ హిస్టరీలోకి వెళ్లండి

-మీ యూఏఎన్‌తో లింక్ అయిన మెంబర్ ఐడీలు అక్కడ కనిపిస్తాయి

-మీరు తొలగించాలనుకున్న మెంబర్ ఐడీ దగ్గర కనిపించే డీలింక్ ఆప్షన్ ఎంచుకోండి

-డిసెంబర్ 13,2016 కంటే ముందు కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉంటే తొలగించే అవకాశం ఉండదు

-అలా కాకపోతే మెంబర్ ఐడీ ఎందుకు తీసివేస్తున్నారనే కారణం వెల్లడించాలి

-ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయండి

-ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-మెంబర్ ఐడీ క్రియేట్ చేసిన యజమానికి మీ రిక్వెస్ట్ చేరుతుంది

-మీ అభ్యర్థనను పరిశీలించి ఆమోదిస్తారు

-మెంబర్ ఐడీపై రెండు కంటే ఎక్కసార్లు చెల్లింపులు అందిచకపోతే యజమాని ఆమోదించిన తర్వాత తొలగించబడుతుంది

-గరిష్టంగా ఆరుసార్లు వరకు చెల్లింపులు చేసి ఉంటే ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ అవుతుంది

-ఆరు కంటే ఎక్కువసార్లు జమ చేసి ఉంటే ఈ ప్రక్రియ ద్వారా డీలింక్ చేయబడుతుంది

Follow Us