ప్రకృతి వైపరీత్యాలకు నిర్లక్ష్యమే కారణం.. భారత్‌లో వరదల తీవ్రత ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..

భవిష్యత్తులో వచ్చే పర్యావరణ మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలో వర్షపాతం తీరుతెన్నులు మారుతాయని, వరదలు పెరుగుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

ప్రకృతి వైపరీత్యాలకు నిర్లక్ష్యమే కారణం.. భారత్‌లో వరదల తీవ్రత ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 5:57 PM

America scientists Comments : వరుస ప్రకృతి వైపరీత్యాలకు గల కారణాలపై ఖగోళ శాస్త్రవేత్తలు కీలక నివేదికను వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే పర్యావరణ మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలో వర్షపాతం తీరుతెన్నులు మారుతాయని, వరదలు పెరుగుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గుండ్రంగా ఉండే భూమిని అడ్డంగా విభజిస్తే పైన ఉత్తరార్ధ గోళం.. కింద దక్షిణార్ధ గోళం ఉంటాయి. రెండింటినీ విభజిస్తూ భూమధ్యరేఖ ఉంటుంది. భూమధ్యరేఖ వెంబడి ఉండే ట్రాపికల్‌ రెయిన్‌బెల్ట్‌ వల్ల ఆ రేఖకు పైన, కింద వర్షాలు పడే ప్రాంతాలను ట్రాపికల్‌ రెయిన్‌బెల్ట్‌గా వ్యవహరిస్తారు.

అయితే, ట్రాపికల్‌ రెయిన్‌బెల్ట్‌ తూర్పు అర్ధగోళంలో ఉత్తరం వైపునకు, పశ్చిమ అర్దగోళంలో దక్షిణం వైపునకు మారడం వల్ల దక్షిణ భారతదేశంలో తీవ్రస్థాయిలో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 2100 నాటికి అంతర్జాతీయంగా జీవ వైవిధ్యం, ఆహార భద్రత ప్రమాదంలో పడే ముప్పుందని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. ఇదంతా పర్యావరణ కాలుష్యం వల్లే ఏర్పడే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక, ఇప్పటి నుంచే పర్యావరణాన్ని కాపాడుకోవల్సిన దానిపై దృష్టి సారిస్తే మంచిదంటున్నారు నిపుణులు.

Read Also… మరో కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. టీకా మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోరుతూ దరఖాస్తు..!