కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. మందుబాబులూ తస్మాత్ జాగ్రత్త.! అప్పటివరకు నో ఆల్కహాల్..

Covid 19 Vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి టీకాను....

  • Ravi Kiran
  • Publish Date - 5:39 pm, Wed, 20 January 21
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. మందుబాబులూ తస్మాత్ జాగ్రత్త.! అప్పటివరకు నో ఆల్కహాల్..
Covid 19 Vaccine

Covid 19 Vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి టీకాను వేస్తున్నారు. వీరి తర్వాత పోలీసులకు.. ఆ తర్వాత వృద్దులకు, సామాన్యులకు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలో కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారికి.. ముఖ్యంగా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారు 45 రోజుల పాటు మద్యం సేవించరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని.. వైరస్‌ను ఎదుర్కునేందుకు కావాల్సిన యాంటీ బాడీస్ వృద్ధి చెందవని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కొన్ని వారాలు మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

”ముప్పై రోజుల వ్యవధిలో కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి. ఇక సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతే వైరస్‌తో పోరాడడానికి యాంటీ బాడీస్ వృద్ది చెందుతాయి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే.. అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను అడ్డుకుంటుంది. ఇది పూర్తిగా నిజం. కాబట్టి టీకాల పూర్తి ప్రభావం, ప్రయోజనాన్ని పొందాలంటే ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలి. ప్రస్తుత డేటా ప్రకారం, వ్యాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న తర్వాత 14 రోజులకే యాంటీ బాడీస్ వృద్ది చెందుతాయి. అందువల్ల వ్యాక్సిన్ తీసుకోబోయే వారు.. ఇప్పటికే తీసుకున్నవారు మద్యానికి సుమారు 45 రోజుల పాటు దూరంగా ఉండటం మంచిదని” నేషనల్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ తెలిపారు.