AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..

విశాఖలో షాక్ కి గురిచేసిన గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అల‌ర్ట‌య్యింది. రాష్ట్రంలో గ్యాస్‌‌లను ఉపయోగించే 36 పరిశ్రమలను గుర్తించిన స‌ర్కార్.. ఆ యూనిట్లలో తనిఖీ చేపట్టాలని వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తోంది. ఏ యూనిట్లలోనైనా స్టిరేన్ వాయువును ఉపయోగిస్తున్నారా అనే విష‌యాన్ని కూడా అధికారులు ఆరా తీయ‌నున్నారు. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజుల్లో ఈ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది. ‘రాష్ట్రంలో 36 యూనిట్లు పారిశ్రామిక‌ గ్యాస్‌లను వాడుతున్నాయి. […]

విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 08, 2020 | 3:48 PM

Share

విశాఖలో షాక్ కి గురిచేసిన గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అల‌ర్ట‌య్యింది. రాష్ట్రంలో గ్యాస్‌‌లను ఉపయోగించే 36 పరిశ్రమలను గుర్తించిన స‌ర్కార్.. ఆ యూనిట్లలో తనిఖీ చేపట్టాలని వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తోంది. ఏ యూనిట్లలోనైనా స్టిరేన్ వాయువును ఉపయోగిస్తున్నారా అనే విష‌యాన్ని కూడా అధికారులు ఆరా తీయ‌నున్నారు. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజుల్లో ఈ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది.

‘రాష్ట్రంలో 36 యూనిట్లు పారిశ్రామిక‌ గ్యాస్‌లను వాడుతున్నాయి. వీటిలో చాలా వరకు రూ.50 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న మధ్యత‌ర‌హా పరిశ్రమలే’ అని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్ల‌డించారు.

తెలంగాణ‌లో ఓ పరిశ్రమ ఏర్పాటుకు అనేక విడ‌త‌ల్లో ప‌ర్మిష‌న్ మంజూరవుతుంది. పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక విభాగాలతోపాటు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమ‌తి కూడా త‌ప్ప‌నిస‌రిగా కావాలి. ఇండ‌స్ట్రీస్ ఏమేం నిల్వ చేస్తాయనే విషయాన్ని కూడా పీసీబీ మోనేట‌ర్ చేస్తుందని రంజన్ తెలిపారు. విశాఖ ఘటన నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ ను తెలంగాణ స‌ర్కార్ అప్రమత్తం చేసింది.

Follow Us