ఫోన్ చేస్తే 24 గంటల్లో వైద్యం.. జగన్ తాజా ఆదేశం

ఫోన్ చేస్తే 24 గంటల్లో వైద్యం.. జగన్ తాజా ఆదేశం

ఏపీలో వైద్య సౌకర్యాలను మెరుగు పరచడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైద్య సదుపాయాల్లో లోపాలు కరోనా పుణ్యమాని వెలుగులోకి వస్తున్నాయి. దాంతో వాటిని నివారించేందుకు ముఖ్యమంత్రి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

Rajesh Sharma

|

May 08, 2020 | 3:39 PM

ఏపీలో వైద్య సౌకర్యాలను మెరుగు పరచడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైద్య సదుపాయాల్లో లోపాలు కరోనా పుణ్యమాని వెలుగులోకి వస్తున్నాయి. దాంతో వాటిని నివారించేందుకు ముఖ్యమంత్రి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ప్రస్తుతం దానికి మెరుగులు దిద్దుతున్నారు. ఇకపై టెలిమెడిసిన్ ద్వారా వైద్య సాయం కోరే వారికి కేవలం 24 గంటల్లోనే వైద్య సౌకర్యం కలిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

కోవిడ్‌–19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా టెలి మెడిసిన్ అమలవుతున్న తీరుతెన్నులను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. మరింత విజయవంతంగా టెలి మెడిసిన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఫోన్‌ చేసి, వైద్య సాయం కోరిన వారెవరైనా కేవలం 24 గంటల్లోనే పూర్తి వైద్య సేవలందించాలని సీఎం నిర్దేశించారు. పీహెచ్‌సీలలో తప్పనిసరిగా బైక్‌లు, థర్మో బ్యాగ్‌లు వీలైనంత అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్‌ కాకుండా కోవిడ్‌యేతర కేసులు ప్రతి రోజూ ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. డాక్టర్లు ప్రిస్కిప్షన్‌ ఇవ్వగానే 24 గంటల్లోగా రోగులకు మందులు అందేలా చూడాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బైకులను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని సీఎం అధికారులకు నిర్దేశించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu