AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియాజ్ స్థానంలో సైఫుల్లా.. వేట మొదలుపెట్టిన సైన్యం..!

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల టాప్ మోస్ట్ టెర్రరిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ఇక మరికొందరు సజీవంగా కూడా పట్టుబడ్డారు. తాజాగా.. జమ్ముకశ్మీర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ రియాజ్ నైకూ కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. అయితే ఇప్పుడు అతని స్థానంలో సైఫుల్లా అనే మరో ఉగ్రవాది హిజ్బుల్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో సైన్యం ఇప్పుడు కొత్త చీఫ్ సైఫుల్లా కోసం వేటాడుతోంది. ఇప్పటి వరకు సౌత్ కశ్మీర్‌లో చురుకుగా ఉన్న సైఫుల్లా.. ఏ ప్లస్ ప్లస్ […]

రియాజ్ స్థానంలో సైఫుల్లా.. వేట మొదలుపెట్టిన సైన్యం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2020 | 3:30 PM

Share

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల టాప్ మోస్ట్ టెర్రరిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ఇక మరికొందరు సజీవంగా కూడా పట్టుబడ్డారు. తాజాగా.. జమ్ముకశ్మీర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ రియాజ్ నైకూ కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. అయితే ఇప్పుడు అతని స్థానంలో సైఫుల్లా అనే మరో ఉగ్రవాది హిజ్బుల్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో సైన్యం ఇప్పుడు కొత్త చీఫ్ సైఫుల్లా కోసం వేటాడుతోంది. ఇప్పటి వరకు సౌత్ కశ్మీర్‌లో చురుకుగా ఉన్న సైఫుల్లా.. ఏ ప్లస్ ప్లస్ కేటగిరికి చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది. ఇతడు.. సైన్యం జరిపే కాల్పుల్లో గాయాలపాలయ్యే ఉగ్రవాదులకు చికిత్స అందేలా వారికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేసేవాడు. అయితే గత రెండు రోజుల క్రితం మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూను తన సొంతూరైన బేగ్‌పోరాలోనే భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రియాజ్ తలపై రూ.12 లక్షల రివార్డ్ కూడా ఉంది. అయితే రియాజ్ హతమవ్వడంతో.. హిజ్బుల్ అతని స్థానంలో కొత్త కమాండర్‌గా సైఫుల్లాకు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 70 మంది ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది.

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?