మ‌ద్యం హోం డెలివ‌రీపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు..!

మ‌ద్యం హోం డెలివ‌రీపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు..!

జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, సంజ‌య్ కృష్ణ కౌల్‌, బీఆర్ గ‌విల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు సూచించింది. కోర్టు ఈ కేసును వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించింది.

Jyothi Gadda

|

May 08, 2020 | 3:23 PM

లాక్‌డౌన్ వేళ మందుబాబుల దుస్థితి వర్ణనాతీతంగా మారింది. మద్యం దొరక్కపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా దేశంలో పలుచోట్ల వెలుగులోకి వ‌చ్చాయి. సుమారు 40 రోజుల లాక్‌డౌన్ అనంతరం మద్యం షాపులు ఒక్కసారిగా తెరుచుకోవడంతో మందుబాబులు కిలోమీటర్ల మేర బారులుతీరారు. దాదాపుగా మద్యం విక్రయాలు ప్రారంభించిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మద్యం షాపుల వద్ద గుంపులు గుంపులుగా మద్యం ప్రియులు నిల్చోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్నిరాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు మ‌ద్యం డోర్ డెలీవ‌రి చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. అయితే, ఈ విధానంపై కొంద‌రు సామాజిక వేత్త‌లు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా కోర్టు ఈ విధంగా స్పందించింది.

కరోనా వ్యాప్తి కట్టడి చర్యలకు మద్యం దుకాణాలను తెరవడం కంటే  హోమ్ డెలివ‌రీ మ‌ద్యం అమ్మ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  సుప్రీ కోర్టు  సూచించింది. వైన్ షాపుల వ‌ద్ద భారీ జ‌న‌స‌మూహాన్ని అరిక‌ట్టేందుకు హోం డెలివ‌రీ అవ‌స‌ర‌మ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. మ‌ద్యం డోర్ డెలీవ‌రీ అంశంపై వేసిన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ ఈ సూచ‌న‌లు చేసింది. అయితే, ఈ కేసులో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయ‌లేదు. భౌతిక దూరం పాటించాలంటే మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఉందని ధ‌ర్మాస‌నం సూచించింది. జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, సంజ‌య్ కృష్ణ కౌల్‌, బీఆర్ గ‌విల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు సూచించింది. కోర్టు ఈ కేసును వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించింది.

భౌతిక దూరం పాటించాలంటే మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఉందని ధ‌ర్మాస‌నం పేర్కొంది. మార్చి 25వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ వ‌ల్ల మ‌ద్యం షాపులు మూత‌ప‌డ్డాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొన్ని రాష్ట్రాలు మ‌ద్యం అమ్మ‌కాల‌ను మొద‌లుపెట్టాయి. దీంతో జ‌నం ఒక్క‌సారిగా షాపుల ముందు చేరుకుంటున్నారు. కిలోమీట‌ర్ల కొద్ది క్యూలైన్లు ఉంటున్నాయి. ఈ అవ‌స్థ‌లు తప్పించాలంటే హోం డెలీవ‌రి ఒక్క‌టే మార్గంగా కోర్టు సూచించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu